Telugu Global
Cinema & Entertainment

Kalyan Ram | వెయ్యి మంది ఆర్టిస్టులతో క్లైమాక్స్

Kalyan Ram - తన కొత్త సినిమా క్లయిమాక్స్ పూర్తిచేశాడు కల్యాణ్ రామ్. కేవలం ఈ షెడ్యూల్ కే రూ.8 కోట్లు ఖర్చయింది.

Kalyan Ram | వెయ్యి మంది ఆర్టిస్టులతో క్లైమాక్స్
X

హీరో నందమూరి కళ్యాణ్ రామ్ మరో సినిమా పూర్తిచేశాడు. తన కెరీర్ లో 21వ చిత్రాన్ని ప్రదీప్ చిలుకూరి దర్శకత్వంలో చేస్తున్న కల్యాణ్ రామ్.. తాజాగా ఆ సినిమా క్లయిమాక్స్ షూటింగ్ పూర్తి చేశాడు.

హైదరాబాద్ శివార్లలో వేసిన సెట్‌లో 30 రోజుల పాటు ఈ క్లయిమాక్స్ పార్ట్ షూటింగ్ జరిగింది. ఈ ఒక్క షెడ్యూల్ కే దాదాపు 8 కోట్ల రూపాయలు ఖర్చు చేశారు మేకర్స్. కల్యాణ్ రామ్ కెరీర్ లో ఇంత భారీ క్లైమాక్స్ ఎందులోనూ లేదంటున్నారు మేకర్స్.

అద్భుతమైన సెట్స్ రూపొందించడంలో పేరున్న బ్రహ్మ కడలి ఈ భారీ సెట్ డిజైన్‌ చేశారు. యాక్షన్ కొరియోగ్రఫీని రామకృష్ణ పర్యవేక్షించారు. యాక్షన్ సన్నివేశాలు, స్టంట్లు నెక్ట్స్ లెవెల్ లో ఉంటాయంటున్నారు. క్లైమాక్స్ సీక్వెన్స్‌లో ప్రముఖ తారాగణం మాత్రమే కాకుండా దాదాపు 1000 మంది ఆర్టిస్టులు పాల్గొన్నారు.

ఈ సినిమాలో విజయశాంతి కీలక పాత్ర పోషిస్తున్న సంగతి తెలిసిందే. సరిలేరు నీకెవ్వరు తర్వాత విజయశాంతి చేస్తున్న మూవీ ఇదే. ఇందులో ఆమె ఐపీఎస్ ఆఫీసర్ గా కనిపించబోతున్నారు. సోహైల్ ఖాన్, సాయి మంజ్రేకర్, శ్రీకాంత్ ముఖ్యమైన పాత్రలు పోషిస్తున్నారు. అజనీష్ లోక్‌నాథ్ మ్యూజిక్ అందిస్తున్నారు.

First Published:  31 July 2024 7:16 AM GMT
Next Story