Telugu Global
Cinema & Entertainment

Kalki Song | హిందీ టు తెలుగు డబ్బింగ్?

Kalki Promotional song - భైరవ ఏంథమ్ అంటూ కల్కి ప్రచారం గీతాన్ని విడుదల చేశారు. తెలుగు కంటే, హిందీ వెర్షనే బాగుంది.

Kalki Song | హిందీ టు తెలుగు డబ్బింగ్?
X

ప్రభాస్ హీరోగా నటిస్తున్న సినిమా కల్కి. ఇది పాన్ వరల్డ్ మూవీ. ఒకేసారి తెలుగు-హిందీ భాషల్లో తెరకెక్కిస్తున్న సినిమా. మరి పాటల్ని కూడా అలానే కంపోజ్ చేస్తే బాగుండేది. ఆ ప్రయత్నం జరిగిందా అనే అనుమానం కలుగుతోంది.

తాజాగా కల్కి సినిమా నుంచి ఫస్ట్ సాంగ్ రిలీజైంది. దీనికి 'బైరవ ఆంథెమ్' అని పేరు పెట్టారు. నిజానికి ఇది సినిమాలో పాట కాదు, ప్రచార గీతం మాత్రమే. అయితే తెలుగు కోసం, హిందీ కోసం వేర్వేరుగా కంపోజ్ చేసి ఉంటే బాగుండేది.

బైరవ ఆంథెమ్ హిందీ వెర్షన్ ఓసారి వినండి, చాలా బాగుంది. ఆ వెంటనే తెలుగు వెర్షన్ వినండి. ఈ సాంగ్ ను ముందుగా హిందీలోనే కంపోజ్ చేశారని, ఆ తర్వాత తెలుగు లిరిక్స్ యాడ్ చేశారనే విషయం ఈజీగా అర్థమౌతుంది. తెలుగులో సాహిత్యానికి, పంజాబీ మిక్స్ సెట్ అవ్వలేదు. హిందీ వెర్షన్ లో సాహిత్యంలో ప్రాస కనిపించింది, సంగీతంలో అది సింక్ అయింది. తెలుగులో అది పూర్తిగా మిస్సయింది.

కల్కి ఫస్ట్ సాంగ్ పై ప్రభాస్ ఫ్యాన్స్ చాలా హోప్స్ పెట్టుకున్నారు. వాళ్లకు ఇది నచ్చి ఉండొచ్చు. కానీ ఓవరాల్ గా చూసుకుంటే తెలుగులో వైరల్ అయ్యే సాంగ్ కాదిది. హిందీ వెర్షన్ కు మాత్రం వైరల్ అయ్యే లక్షణాలున్నాయి.

ఈ సంగతి పక్కనపెడితే, సంతోష్ నారాయణన్ సంగీతం మాత్రం కట్టిపడేసేలా ఉంది. కొరియోగ్రఫీ కూడా బాగుంది. మధ్యమధ్యలో వచ్చిన ప్రభాస్ ఆకట్టుకున్నాడు.

First Published:  20 Jun 2024 10:25 PM IST
Next Story