Telugu Global
Cinema & Entertainment

Kalki Movie | ఓటీటీలో కల్కి స్ట్రీమింగ్ ఎప్పుడంటే...?

Kalki OTT - ప్రభాస్ హీరోగా నటించిన కల్కి సినిమా బ్లాక్ బస్టర్ హిట్టయింది. మరి ఈ సినిమా ఓటీటీలోకి ఎప్పుడొస్తుంది?

సీక్వెలా? మూడేళ్ళు వెయిట్ చేయండి!
X

కల్కి బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని సాధించింది. సలార్ తర్వాత ప్రభాస్ వరుసగా రెండో బ్లాక్ బస్టర్ అందుకున్నట్టయింది. ఈ చిత్రం థియేటర్లలో నడుస్తుండగా, అభిమానులు కల్కి ఓటీటీ స్ట్రీమింగ్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

తాజాగా ఆ మేటర్ ను అధికారికంగా ప్రకటించారు. కల్కి సినిమా ఇప్పట్లో ఓటీటీలోకి రాదనేది వాళ్ల మాట. థియేటర్లలో విడుదలైన 10 వారాల తర్వాతే ఓటీటీలోకి వచ్చేలా అగ్రిమెంట్ చేసుకున్నారట.

ఈ లెక్కన చూసుకుంటే, కల్కి థియేటర్లలోకి వచ్చి 3 వారాలైంది. సో.. ఓటీటీ రిలీజ్ కోసం మరో 4 వారాలు, అంటే నెలన్నరకు పైగా ఆగాలన్నమాట. తాజా సమాచారం ప్రకారం.. ఆగస్టు చివరి వారాంతంలో లేదా సెప్టెంబర్ మొదటి వారంలో ఈ సినిమా ఓటీటీలోకి వచ్చే అవకాశం ఉంది.

అమెజాన్ ప్రైమ్ కంపెనీ ఈ సినిమా స్ట్రీమింగ్ రైట్స్ దక్కించుకుంది. తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో ఒకేసారి స్ట్రీమింగ్ కు పెట్టబోతోంది. కల్కి హిందీ ఓటీటీ రైట్స్ ను మాత్రం నెట్ ఫ్లిక్స్ దక్కించుకుంది. ప్రస్తుతం ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా 1100 కోట్ల రూపాయల వసూళ్లతో దూసుకుపోతోంది.

First Published:  17 July 2024 6:41 AM GMT
Next Story