Kalki Release Date | కల్కి కొత్త విడుదల తేదీ
Kalki New Release Date - కల్కి సినిమాకు కొత్త విడుదల తేదీ ప్రకటించారు.

ప్రపంచవ్యాప్తంగా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న సైన్స్ ఫిక్షన్ చిత్రం 'కల్కి 2898 AD'. ప్రభాస్ హీరోగా నటిస్తున్న ఈ పాన్ వరల్డ్ సినిమాకు తాజాగా మరో విడుదల తేదీ ఫిక్స్ చేశారు. జూన్ 27న కల్కి సినిమా థియేటర్లలోకి రాబోతోంది.
అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, ప్రభాస్ వంటి ఇండియన్ బిగ్గెస్ట్ స్టార్స్ తో సహా దీపికా పదుకొణె, దిశా పటాని లాంటి స్టార్ హీరోయిన్లతో రూపొందతున్న ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. అందుకే ఈ సినిమాపై అంత క్రేజ్. విడుదల తేదీకి సరిగ్గా 2 నెలలు మాత్రమే సమయం ఉంది.
ఇప్పటికే సినిమా నుంచి భైరవగా ప్రభాస్ లుక్ ను విడుదల చేశారు. తాజాగా అశ్వద్ధామగా అమితాబ్ లుక్ ను కూడా బయటపెట్టారు. దీపిక, దిశా పటానీ ఫస్ట్ లుక్స్ ఇప్పటికే వచ్చాయి. కమల్ హాసన్ లుక్ మాత్రం పెండింగ్ లో ఉంది.
వైజయంతీ మూవీస్ బ్యానర్ పై 2 భాగాలుగా తెరకెక్కుతోంది కల్కి సినిమా. మొదటి భాగాన్ని జూన్ 27న విడుదల చేస్తారు. సంతోష్ నారాయణన్ ఈ సినిమాకు సంగీత దర్శకుడు.