Telugu Global
Cinema & Entertainment

Kalki Movie | తెలుగు కంటే హిందీలోనే ఎక్కువ

Kalki Movie - కల్కి సినిమా నిన్నటితో 50 రోజులు పూర్తి చేసుకుంది. ఈ సినిమా తెలుగు వెర్షన్ కంటే హిందీ వెర్షన్ కే ఎక్కువ వసూళ్లు వచ్చాయి

Kalki Movie | తెలుగు కంటే హిందీలోనే ఎక్కువ
X

ప్రభాస్ స్టామినా మరోసారి అందరికీ తెలిసొచ్చింది. పాన్ ఇండియా స్టార్ ఇమేజ్ ను అతడు మరోసారి నిలబెట్టుకున్నాడు. కల్కి సినిమా తెలుగు వెర్షన్ కంటే, హిందీ వెర్షన్ కే ఎక్కువ వసూళ్లు వచ్చాయి. 49 రోజులు పూర్తయ్యేనాటికి ఇండియాలో కల్కి సినిమా తెలుగు వెర్షన్ కు 225 కోట్ల రూపాయల వసూళ్లు రాగా.. హిందీ వెర్షన్ కు 227 కోట్ల రూపాయల కలెక్షన్లు వచ్చాయి.

ఈ సినిమా తెలుగు వెర్షన్ రన్ దాదాపు ముగిసింది. తాజాగా వచ్చిన మిస్టర్ బచ్చన్, డబుల్ ఇస్మార్ట్ తో కల్కికి థియేటర్లు మరిన్ని తగ్గిపోయాయి. అయితే హిందీ బెల్ట్ లో మాత్రం సినిమా ఇంకా స్టడీగా ఉండడం విశేషం. మరీ ముఖ్యంగా, బి, సి సెంటర్లలో ఈ సినిమాకు నిలకడగా వసూళ్లు వస్తున్నాయి.

అయితే తాజాగా స్త్రీ-2 సినిమాకు బ్లాక్ బస్టర్ టాక్ రావడంతో ఆ ప్రభావం కల్కి సినిమాపై పడే అవకాశం ఉంది. ఓవర్సీస్ లో ఈ సినిమా రన్ ఇప్పటికే ముగిసింది. మరో వారం రోజుల్లో ఇండియాలో కూడా కల్కి థియేట్రికల్ రన్ పూర్తవుతుంది.

మరోవైపు ఈ సినిమా ఓటీటీ స్ట్రీమింగ్ పై ఇంకా అధికారిక ప్రకటన రాలేదు. ఈ నెలాఖరుకు కల్కి సినిమా ఓటీటీలోకి వస్తుందనే ప్రచారం నడుస్తోంది. కల్కి-2 సినిమా వచ్చే ఏడాది చివర్లో సెట్స్ పైకి వచ్చే అవకాశం ఉంది.

First Published:  16 Aug 2024 3:27 AM GMT
Next Story