Telugu Global
Cinema & Entertainment

రెండు ఓటీటీల్లో క‌ల్కి 2898 ఏడీ.. స్ట్రీమింగ్ వివ‌రాలు ఇవే

Kalki 2898 AD Telugu Movie OTT: క‌ల్కి 2898 ఏడీ మూవీ తెలుగు, త‌మిళ్‌, క‌న్న‌డ‌, మ‌ల‌యాళ భాష‌ల‌కు సంబంధించిన డిజిటల్ హ‌క్కుల‌ను అమెజాన్ ప్రైమ్ వీడియో ద‌క్కించుకున్న‌ట్లు స్ప‌ష్ట‌మైంది.

రెండు ఓటీటీల్లో క‌ల్కి 2898 ఏడీ.. స్ట్రీమింగ్ వివ‌రాలు ఇవే
X

మహానటి మూవీతో అందరి దృష్టిని ఆకర్షించిన మోస్ట్‌ టాలెంటెడ్ డైరెక్టర్ నాగ్ అశ్విన్ నుంచి తాజాగా వచ్చిన చిత్రం కల్కి 2898 ఏడీ. ఈ సైన్స్ ఫిక్షన్ ఫ్యూచరిస్టిక్ ఫాంటసీ ఫిల్మ్ లో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటిస్తే.. అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దీపికా పదుకొనే, దిశా పటానీ, శోభ‌న‌ తదితరులు ముఖ్యమైన పాత్రల‌ను పోషించారు.

రూ. 600 కోట్లకు పైగా బడ్జెట్ తో సీనియర్ ప్రొడ్యూస‌ర్ అశ్వినీ దత్ నిర్మించిన కల్కి మూవీ నేడు తెలుగు తో పాటు తమిళ్, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో విడుదలై సూపర్ హిట్ టాక్ ను సొంతం చేసుకుంది. అన్ని భాషల్లోనూ ఈ చిత్రానికి విశేషమైన స్పందన లభిస్తోంది. హాలీవుడ్ సినిమాలను మరిపించే విధంగా ఉన్న కల్కి ఆడియన్స్ కు సరికొత్త ఎక్స్పీరియన్స్ ను పంచుతూ కొత్త రికార్డులు సెట్ చేసేందుకు రెడీ అవుతోంది.

ఇదిలా ఉండగా.. కల్కి డిజిటల్ రైట్స్ కు సంబంధించిన వివరాలు తాజాగా బయటకు వచ్చాయి. ఈ అసలు సిసలైన పాన్ ఇండియా చిత్రం రెండు ఓటీటీల్లో సందడి చేయబోతోంది. కల్కి 2898 ఏడీ హిందీ వెర్షన్ డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్ ను దిగ్గ‌జ ఓటీటీ ఫ్లాట్ ఫామ్‌ నెట్ ఫ్లిక్స్ సొంతం చేసుకుంది. ఈ రోజు థియేటర్స్ లో హిందీ వెర్షన్ స్క్రీన్ లలో తమ ఓటీటీ పార్ట్‌న‌ర్‌ నెట్ ఫ్లిక్స్ అని చిత్ర యూనిట్ క‌న్ఫార్మ్ చేసింది. హిందీ డిజిట‌ల్ రైట్స్ రూ. 175 కోట్లు ప‌లికిన‌ట్లు టాక్.

అలాగే క‌ల్కి మూవీ తెలుగు, త‌మిళ్‌, క‌న్న‌డ‌, మ‌ల‌యాళ భాష‌ల‌కు సంబంధించిన డిజిటల్ హ‌క్కుల‌ను అమెజాన్ ప్రైమ్ వీడియో ద‌క్కించుకున్న‌ట్లు స్ప‌ష్ట‌మైంది. ఈ డీల్ రూ. 200 కోట్లకు ముగిసిన‌ట్లు ఫిల్మ్ స‌ర్కిల్స్ లో ప్ర‌చారం జ‌రుగుతోంది. ఇక స్ట్రీమింగ్ విష‌యానికి వ‌స్తే.. ఆగ‌స్ట్ నెలాఖ‌రున లేదా సెప్టెంబ‌ర్ లో క‌ల్కి మూవీ ఓటీటీల్లోకి వ‌చ్చే అవ‌కాశాలు ఉన్నాయి.

First Published:  27 Jun 2024 10:18 AM GMT
Next Story