Telugu Global
Cinema & Entertainment

Maharagni | మహారాగ్ని ఎవరు?

Maharagni - డిఫరెంట్ కాంబినేషన్ తో తెరకెక్కుతోంది మహారాగ్ని. ప్రభుదేవా కీలక పాత్ర పోషిస్తున్న ఈ సినిమాలో మహారాగ్ని అంటే ఎవరో చూద్దాం..ొ

Maharagni | మహారాగ్ని ఎవరు?
X

చరణ్ తేజ్ ఉప్పలపాటి దర్శకత్వం వహిస్తున్న పాన్ ఇండియా చిత్రం మహారాగ్ని. భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ యాక్షన్ థ్రిల్లర్‌లో బాలీవుడ్ స్టార్ నటులు కాజోల్, ప్రముఖ కొరియోగ్రాఫర్ ప్రభుదేవ ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. వీరితో పాటు స్టార్ కాస్టింగ్ నసీరుద్దీన్ షా, సంయుక్త మీనన్, జిషు సేన్ గుప్తా, ఆదిత్య సీల్ తదితరులు నటిస్తునారు. ఈ చిత్రం నుంచి తాజాగా టీజర్ విడులైంది.

టీజర్ ఆద్యంతం ఉత్కంఠ భరితంగా సాగింది. ముందుగా ప్రభుదేవా, ఆ తర్వాత సంయుక్త మీనన్, ఆ వెంటే కాజోల్ ను పరిచయం చేసిన విధానం బాగుంది. ప్రభుదేవా స్వాగ్, యాక్షన్ సీక్వెన్సెస్ అదిరిపోయాయి. బ్యూటీ సంయుక్త మీనన్ చాలా ఇంటెన్స్ పాత్రలో కనిపిస్తున్నట్లు టీజర్ చూస్తే అర్థమవుతుంది.

అలాగే నసీరుద్దీన్ షా క్యారెక్టర్ ను కూడా రివీల్ చేశారు. ఇక చివరిగా డైనమిక్ లేడీ, బాలీవుడ్ సీనియర్ హీరోయిన్ కాజోల్ ఎంట్రీని అద్భుతంగా చూపించారు.. జాతరలో ఫైట్ చేసే సీన్, తాను చెప్పే డైలాగ్ బాగున్నాయి. ఈ చిత్రంలో మహారాగ్నిగా కనిపించనుంది కాజోల్. దీనికి క్వీన్ ఆఫ్ క్వీన్స్ అనే ట్యాగ్ లైన్ పెట్టారు.

టీజర్ లో విజువల్ ఎఫెక్ట్స్, విష్ణు సినిమాటోగ్రఫీ బాగున్నాయి. హర్షవర్ధన్ రామేశ్వర్ ఈ సినిమాకి సంగీతం అందిస్తున్నాడు. త్వరలోనే ఈ సినిమా విడుదల తేదీని ప్రకటిస్తారు. హిందీతో పాటు, అన్ని దక్షిణాది భాషల్లో విడుదల కానుంది మహారాగ్ని. అజయ్ దేవగన్ ఆల్రెడీ సౌత్ లో ఎంట్రీ ఇచ్చాడు. ఆర్ఆర్ఆర్ సినిమాలో కీలక పాత్ర పోషించాడు. ఇప్పుడు అతడి భార్య కాజోల్ కూడా మహారాగ్ని సినిమాతో సౌత్ లో ఎంట్రీ ఇస్తోంది.

First Published:  31 May 2024 5:04 PM GMT
Next Story