Telugu Global
Cinema & Entertainment

Kajal | కన్నప్పలో కాజల్

Kajal in Kannappa - కన్నప్ప సినిమాలో ముందుగా నయనతారను అనుకున్నారు. కానీ ఆమె నో చెప్పింది. ఇప్పుడా స్థానంలోకి కాజల్ ను తీసుకున్నారు.

Kajal | కన్నప్పలో కాజల్
X

హీరో విష్ణు మంచు డ్రీమ్ ప్రాజెక్ట్‌ ‘కన్నప్ప’ నుంచి వస్తున్న ప్రతీ అప్ డేట్ సినిమాపై అంచనాలు పెంచేస్తోంది. రీసెంట్‌గా బాలీవుడ్ స్టార్ అక్షయ్ కుమార్ తన పాత్రకు సంబంధించిన షూటింగ్‌ను ముగించడం, ఆ తర్వాత డార్లింగ్ ప్రభాస్‌ సెట్‌లోకి రావడం.. ఇలా ప్రతీ ఒక్క అప్డేట్‌తో కన్నప్ప నేషనల్ వైడ్‌గా ట్రెండ్ అవుతూనే వస్తోంది. తాజాగా కన్నప్పకు సంబంధించిన మరో అప్ డేట్ వైరల్ గా మారింది.

కన్నప్ప చిత్రంలోని ఓ కీలక పాత్రలో కాజల్ అగర్వాల్ నటిస్తోంది. ఈ మేరకు కన్నప్ప లో కాజల్ అనే హ్యాష్ ట్యాగ్ ట్రెండ్ అవుతోంది. ఆల్రెడీ విష్ణు మంచు, కాజల్ కలిసి ఇది వరకు మోసగాళ్లు మూవీని చేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడిలా మంచు విష్ణు టైటిల్ రోల్‌లో చేస్తోన్న కన్నప్ప చిత్రంలో కాజల్ ఓ కీ రోల్‌ను పోషిస్తోంది. పైగా ఇది మంచు విష్ణుకు ప్రతిష్టాత్మక సినిమా అనే సంగతి తెలిసిందే.

మోహన్ బాబు నిర్మిస్తున్న ఈ కన్నప్ప చిత్రానికి ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ మూవీని ఎక్కువగా న్యూజిలాండ్‌లోని అందమైన ప్రదేశాల్లో చిత్రీకరించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ హైద్రాబాద‌్ లో జరుగుతోంది. మే 20న కేన్స్‌లో జరిగే ఫిల్మ్ ఫెస్టివల్‌లో కన్నప్ప టీజర్‌ను లాంచ్ చేయబోతోన్న సంగతి తెలిసిందే.

First Published:  18 May 2024 8:51 AM GMT
Next Story