Kajal Agarwal | ఇకపై అలాంటి పాత్రలే చేస్తా
Kajal Agarwal - రీఎంట్రీలో విమర్శలు ఎదుర్కొంది కాజల్ అగర్వాల్. అయితే ఇకపై తను ఎలాంటి పాత్రలు చేస్తానో వివరించింది ఈ సీనియర్ నటి.
కాజల్ కుండబద్దలుకొట్టింది. రీఎంట్రీలో తను ఎలాంటి సినిమాలు చేయబోతున్నానో వెల్లడించింది. ఇకపై మేకర్స్ తనను సంప్రదించినప్పుడు ఆ విషయాలు గుర్తుపెట్టుకోవాలని చెబుతోంది. ఇంతకీ కాజల్ మనసులో ఏముంది?
రీఎంట్రీలో కేవలం తన పాత్రకు ప్రాధాన్యం ఉన్న పాత్రలు మాత్రమే పోషిస్తానని క్లారిటీ ఇచ్చింది కాజల్. ఒకప్పట్లా గ్లామర్ రోల్స్ చేసే ఉద్దేశం లేదని, కేవలం సాంగ్స్ కోసం మాత్రమే తీసుకునే హీరోయిన్ పాత్రలను ఒప్పుకోనని ఓపెన్ గా చెబుతోంది. నటించడానికి స్కోప్ ఉండే పాత్రలు కావాలని, అలాంటి క్యారెక్టర్స్, కథలు ఉంటేనే తనను సంప్రదించాలని చెబుతోంది.
రీఎంట్రీలో ఆమె భారతీయుడు-2లో నటించింది. ఇక సత్యభామ అనే మహిళా ప్రాధాన్యం ఉన్న సినిమా కూడా చేస్తోంది. ఈ రెండు సినిమాల్లో తన పాత్రలు చాలా బాగుంటాయని చెబుతోంది కాజల్. భారతీయుడు-2 కోసం కేరళకు చెందిన ప్రాచీన యుద్ధ కళను నేర్చుకుందట కాజల్. ఇక సత్యభామ కోసం మిక్స్డ్ మార్షల్ ఆర్ట్స్ నేర్చుకుందట.
ఇలా తన పాత్ర కోసం ఎంతైనా కష్టపడతానని, కాబట్టి మంచి పాత్రలతో తనను సంప్రదించాలని చెబుతోంది. భగవంత్ కేసరి సినిమాలో కాత్యాయణి అనే సైకాలజిస్ట్ పాత్ర పోషించింది కాజల్. అది ఆమెకు పెద్దగా పేరు తీసుకురాలేదు. ఇకపై అలాంటి పాత్రలు పోషించనని పరోక్షంగా చెబుతోంది ఈ బ్యూటీ.