ఓటీటీల్లో వెతుక్కునే పని లేకుండా..
ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లో లెక్కలేనన్ని సినిమాలు, వెబ్ సిరీస్‌లు అందుబాటులో ఉన్నాయి. తీరిగ్గా ఎప్పుడైనా సినిమా చూద్దామనుకున్నప్పుడు ‘ఏది చూడాలి?’ అనే ఆలోచన వస్తుంది.
ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లో లెక్కలేనన్ని సినిమాలు, వెబ్ సిరీస్‌లు అందుబాటులో ఉన్నాయి. తీరిగ్గా ఎప్పుడైనా సినిమా చూద్దామనుకున్నప్పుడు ‘ఏది చూడాలి?’ అనే ఆలోచన వస్తుంది. అందుకే మంచి సినిమా సజెస్ట్ చేయమని ఫ్రెండ్స్‌ను అడుగుతుంటారు. అయితే ఈ ప్రాబ్లమ్‌కు సొల్యూషన్‌గా కొన్ని యాప్స్ అందుబాటులో ఉన్నాయి. ఇవి యూజర్ల ఇష్టానికి తగ్గట్టు సినిమాలు, షోలను సజెస్ట్ చేస్తాయి.
ఫోన్‌లో ‘జస్ట్‌వాచ్’ అనే యాప్ ఇన్‌స్టా్ల్ చేసుకుంటే ‘ఏ సినిమా చూడాలి?’ అన్న కన్ఫ్యూజన్ కొంతవరకు తగ్గుతుంది. ఎందుకంటే ఈ యాప్.. యూజర్లకు స్ట్రీమింగ్ గైడ్‌లా పనిచేస్తుంది. యూజర్ల ఇష్టాయిష్టాలు, లాంగ్వేజీ ప్రిఫరెన్స్‌లను బట్టి కొత్త, పాత సినిమాలు, వెబ్ సిరీస్‌లను చూపిస్తుంది. యూజర్లు ఎలాంటి కంటెంట్‌ను ఇష్టపడుతున్నారో అలాంటి జానర్ సినిమాలు, షోలను సజెస్ట్ చేస్తుంది.
‘ఫ్లిక్స్‌జినీ’ అనే మరో యాప్/ వెబ్‌సైట్ కూడా యూజర్లకు మంచి స్ట్రీమింగ్ గైడ్‌గా పనిచేస్తుంది. నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్, హాట్‌స్టార్ వంటి రకరకాల ఓటీటీల్లో ఏమేం కొత్త సినిమాలు వచ్చాయి. వాటి రేటింగ్స్, రివ్యూస్ ఎలా ఉన్నాయో చెప్తుంది. యూజర్లకు నచ్చే కంటెంట్‌ను అంచనా వేసి, సజెషన్స్ రూపంలో చూపిస్తుంది.
ప్రతి వారం ఓటీటీల్లో రిలీజ్ అయ్యే సినిమాలు, వెబ్ సిరీస్‌ల గురించి తెలుసుకునేందుకు ‘ఓటీటీ ప్లే’ అనే మరో వెబ్‌సైట్/ యాప్ ఉపయోగపడుతుంది. ఈ యాప్ సాయంతో లేటెస్ట్ ఓటీటీ రిలీజ్‌ల అప్‌డేట్స్ తెలుసుకోవచ్చు.