పాప్ సింగర్ జెన్నిఫర్ లోపెజ్ నాలుగో భర్త ఇతడే
పాపులర్ పాప్ సింగర్ జెన్నిఫర్ లోపెజ్ మళ్లీ పెళ్లి చేసుకుంది. ఆమెకిది నాలుగో పెళ్లి.
ఒకప్పుడు ఈమె తన పాటలతో పాపులర్ అయింది. ఆమె మ్యూజిక్ ఆల్బమ్స్ హాట్ కేకుల్లా అమ్ముడుపోయేవి. ఆమె ఓ పాట పాడితే ప్రపంచవ్యాప్తంగా సూపర్ హిట్టయ్యేది. అయితే ఈమధ్య కాలంలో ఆమె పాటల కంటే, వ్యక్తిగత విషయాలతోనే బాగా పాపులర్ అవుతోంది. తాజాగా జెన్నిఫల్ లోపెజ్ నాలుగో పెళ్లి చేసుకుంది.
అమెరికన్ నటుడు, ఫిలిం మేకర్ బెన్ అఫ్లెక్, జెన్నిఫర్ లోపెజ్ కొన్నాళ్లుగా డేటింగ్ లో ఉన్నారు. వీళ్ల డేటింగ్ హాలీవుడ్ లో సంచలనంగా మారింది. ఎందుకంటే, 2003లోనే వీళ్లు ఎంగేజ్ మెంట్ చేసుకున్నారు. అయితే 2004లో దాన్ని రద్దు చేసుకున్నారు. మళ్లీ వీళ్లిద్దరు ఎప్పుడు కలుస్తారా అని అంతా ఎదురుచూస్తున్న టైమ్ లో మళ్లీ డేటింగ్ షురూ చేశారు.
అలా మళ్లీ డేటింగ్ కొనసాగించిన ఈ జంట, ఈ ఏడాది ఏప్రిల్ లో మళ్లీ ఎంగేజ్ మెంట్ చేసుకుంది. తాజాగా వైవాహిక బంధంలోకి ఎంటరైంది. తను అఫ్లెక్ ను పెళ్లి చేసుకున్నట్టు లోపెజ్ ప్రకటించింది. తన పేరును జెన్నిఫర్ లోజెజ్ అఫ్లెక్ గా మార్చుకుంది. ఈ విషయాన్ని బెన్ అఫ్లెక్ కూడా నిర్థారించాడు.
గాయకుడు మార్క్ ఆంటొనీతో చివరిసారిగా జీవితాన్ని షేర్ చేసుకుంది జెన్నిఫర్ లోపెజ్. 2004 నుంచి 2014 వరకు కలిసున్న వీళ్లు, కవలలకు జన్మనిచ్చారు. ఓవైపు ఆంటోనీతో సంసారం చేస్తూనే, మరోవైపు అఫ్లెక్ తో అనుబంధం పెంచుకుంది లోపెజ్. ఫలితంగా 2014లో విడాకులు తీసుకున్నారు.
అటు బెన్ ఆఫ్లెక్ కూడా అంతే. జెన్నిఫర్ గార్నర్ తో 2005 నుంచి 2018 వరకు జీవితాన్ని పంచుకున్నాడు. ముగ్గురు పిల్లలకు జన్మనిచ్చాడు. 2014 నుంచి లోజెజ్ తో సీరియస్ గా డేటింగ్ చేశాడు.