JD Chakravarthy | థియేటర్ కు ఓటీటీకి తేడా అదే!
JD Chakravarthy - థియేటర్లకు, ఓటీటీకి స్పష్టమైన తేడా ఉందంటున్నాడు జేడీ. ఆ తేడా ఏంటనేది తన కోణంలో చెబుతున్నాడు.
జేడీ చక్రవర్తి, ఈషా రెబ్బా, నంబీషన్ రమ్య, కమల్ కామరాజ్ తదితరులు ముఖ్య పాత్రలో నటించిన ‘దయా’ వెబ్ సిరీస్ ఈ నెల 4న డిస్నీ ప్లస్ హాట్ స్టార్‌లో స్ట్రీమింగ్ కానుంది. ఈ వెబ్ సిరీస్‌ను దర్శకుడు పవన్ సాధినేని తెరకెక్కించాడు.
ఈ వెబ్ సిరీస్ లో నటించిన ఎక్సీపిరియన్స్ షేర్ చేసుకున్నారు జేడీ చక్రవర్తి. ఈ సందర్భంగా థియేటర్లకు, ఓటీటీకి మధ్య తేడాను స్పష్టంగా వివరించాడు. థియేటర్ తో పోలిస్తే, ఓటీటీలో కొత్త వాళ్లు క్లిక్ అవ్వడానికి అవకాశాలు ఎక్కువ అంటున్నాడు.
"ఓటీటీలో స్టార్ డమ్ ను కౌంట్ చేయలేం అనడం సరికాదు. సినిమా ఎంత సక్సెస్ అయ్యింది అనేందుకు థియేటర్ లో కలెక్షన్స్ లెక్కిస్తాం. కానీ ఓటీటీలో ఎంతమంది చూశారు అనేది కొలమానం. కథను సినిమాలో కంటే విస్తృతంగా చెప్పేందుకు వెబ్ సిరీస్ బాగా ఉపయోగపడుతుంది. వెబ్ సిరీస్ లో కొత్త వాళ్లకూ ఆదరణ దక్కుతుంది. వాళ్లనూ రిసీవ్ చేసుకుంటారు. కానీ థియేటర్ లో స్టార్స్ కు మాత్రమే బయ్యర్స్ ఉంటారు. ఇది ఓటీటీకున్న అడ్వాంటేజ్."
తనకు ఓ రకమైన ఇమేజ్ ఉన్నప్పటికీ, ఈ వెబ్ సిరీస్ లో కొత్త జేడీని చూస్తారని చెబుతున్నాడు చక్రవర్తి. ఇక బాలీవుడ్ పై కూడా స్పందించాడు. బాలీవుడ్ తనకు పొరుగిల్లు లాంటిదని, అక్కడ్నుంచి చాలా ఆఫర్లు వస్తున్నాయని, కానీ క్యారెక్టర్స్ నచ్చక వదిలేస్తున్నానని తెలిపాడు.