Telugu Global
Cinema & Entertainment

Jr NTR and Janhvi Kapoor: ఎన్టీఆర్ సరసన శ్రీదేవి కూతురు

Jr NTR and Janhvi Kapoor: ఎన్టీఆర్ కొత్త సినిమా కోసం జాన్వి కపూర్ ను తీసుకున్నారు. ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించారు.

Jr NTR and Janhvi Kapoor: ఎన్టీఆర్ సరసన శ్రీదేవి కూతురు
X

RRR వంటి పాన్ ఇండియా సినిమాతో సెన్సేష‌న‌ల్ బ్లాక్ బ‌స్ట‌ర్ సాధించిన ఎన్టీఆర్ ఇప్పుడు ఆస్కార్ వేడుక‌లో పాల్గొన‌టానికి అమెరికా బ‌య‌లుదేరి వెళ్లాడు. ఈ హీరో నెక్ట్స్ మూవీపై భారీ ఎక్స్‌పెక్టేషన్స్ ఉన్నాయి. ఎన్టీఆర్ హీరోగా ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు కొర‌టాల శివ ద‌ర్శ‌క‌త్వంలో ఈ సినిమా రాబోతున్న సంగ‌తి తెలిసిందే. నంద‌మూరి క‌ళ్యాణ్ రామ్ స‌మ‌ర్ప‌ణ‌లో ఎన్టీఆర్ ఆర్ట్స్‌, యువ సుధ ఆర్ట్స్ బ్యాన‌ర్స్‌పై కొస‌రాజు హ‌రికృష్ణ‌, సుధాక‌ర్ మిక్కిలినేని ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

పాన్ ఇండియా మూవీగా రూపొందుతున్న ఈ సినిమాకు సంబంధించి మేక‌ర్స్ మ‌రో అప్‌డేట్ ఇచ్చారు. ఎన్టీఆర్ స‌ర‌స‌న బాలీవుడ్ బ్యూటీ జాన్వీ క‌పూర్ హీరోయిన్‌గా న‌టించబోతున్నట్టు తెలిపారు. ఈ మేరకు పోస్ట‌ర్‌ను విడుద‌ల చేశారు.

ఈ నెల‌లోనే సినిమాను లాంఛ‌నంగా ప్రారంభించి షూటింగ్‌ను కూడా స్టార్ట్ చేస్తారు. వచ్చే ఏడాది ఏప్రిల్ 5కి సినిమాను విడుదల చేయబోతున్నారు.

తెలుగు, హిందీ, క‌న్న‌డ‌, త‌మిళ‌, మ‌ల‌యాళ భాష‌ల్లో రాబోతున్న ఈ సినిమాకు ర‌త్న‌వేలు సినిమాటోగ్రాఫ‌ర్. సాబు సిరిల్‌ ప్రొడ‌క్ష‌న్ డిజైన‌ర్, శ్రీక‌ర ప్ర‌సాద్ ఎడిట‌ర్ గా వ‌ర్క్ చేస్తున్నారు. ప్ర‌ముఖ సంగీత ద‌ర్శ‌కుడు అనిరుద్ ఈ చిత్రానికి మ్యూజిక్ అందిస్తున్నాడు.




First Published:  7 March 2023 5:40 PM IST
Next Story