Telugu Global
Cinema & Entertainment

Janhvi Kapoor | హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయిన జాన్వి

Janhvi Kapoor - రెండు రోజుల కిందట అనారోగ్యానికి గురైంది జాన్వి కపూర్. ఇప్పుడామె హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయింది.

Janhvi Kapoor | హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయిన జాన్వి
X

హీరోయిన్ జాన్వి కపూర్ 2 రోజుల కిందట హాస్పిటల్ లో జాయిన్ అయిన సంగతి తెలిసిందే. ఇప్పుడామె ఇంటికి చేరుకుంది. వైద్యుల పర్యవేక్షణ లేనప్పటికీ, ఆమె మరో 2 రోజుల పాటు ఇంట్లోనే విశ్రాంతి తీసుకోనుంది.

జాన్వి కపూర్ కు ఫుడ్ పాయిజనింగ్ అయింది. అది కూడా తీవ్రస్థాయిలో జరిగింది. చెన్నైలో ఆమె దాదాపు మూర్ఛపోయే స్థితికి చేరుకుంది. వెంటనే అన్ని కార్యక్రమాలు రద్దు చేసుకొని ముంబయి వచ్చేసింది. ముంబయి వచ్చిన తర్వాత పరిస్థితి మరింత విషమించడంతో ఆమెను నేరుగా హాస్పిటల్ కు తరలించారు.

జాన్వి బాయ్ ఫ్రెండ్ శిఖర్ పహారియా ఆమెతో పాటు ఉన్నాడు. ఇంట్లో కూడా ఉంటూ అన్ని పనులు చూసుకుంటున్నాడు శిఖర్. ఆహారం విషయంలో ఎంతో జాగ్రత్తగా ఉంటారు హీరోయిన్ల. జాన్వి కూడా అంతే. అలాంటిది ఆమెకు ఎక్కడ ఫుడ్ పాయిజనింగ్ అయిందనేది తెలియడం లేదు. జాన్వి తండ్రి బోనీ కపూర్, ఈ విషయంపై చాలా సీరియస్ గా ఉన్నారు. చెన్నైలో జాన్వి తీసుకున్న ఆహారంపై ఆయన ఆరా తీస్తున్నారు.

First Published:  20 July 2024 10:32 PM IST
Next Story