Janhvi Kapoor | చరణ్ సరసన జాన్వి కపూర్
Janhvi Kapoor - రామ్ చరణ్, బుచ్చిబాబు సినిమాలో హీరోయిన్ గా జాన్వి కపూర్ ను తీసుకున్నారు. త్వరలోనే ఆమె సెట్స్ పైకి రానుంది.

రామ్ చరణ్, బుచ్చిబాబు సినిమాలో హీరోయిన్ ఫిక్స్ అయింది. ఈ మెగా ప్రాజెక్టులోకి జాన్వి కపూర్ ను హీరోయిన్ గా తీసుకున్నారు. త్వరలోనే ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించబోతున్నారు. అంతకంటే ముందు జాన్వి కపూర్ తండ్రి బోనీ కపూర్, ఈ మేటర్ బయటపెట్టారు.
చరణ్ తో సినిమా కోసం చాలామంది హీరోయిన్లను ఆడిషన్ చేశాడు బుచ్చిబాబు. ఒక దశలో రవీనా టాండన్ కుమార్తెను కూడా హైదరాబాద్ పిలిపించి ఆడిషన్ చేశాడు. కానీ అతడి మనసులో మొదట్నుంచి జాన్వి కపూర్ మాత్రమే ఉంది.
దేవర సినిమాలో బిజీగా ఉన్న జాన్వి, చరణ్ సినిమాకు కాల్షీట్లు కేటాయించలేకపోయింది. అయితే సినిమా రోజురోజుకు ఆలస్యం కావడం, మరోవైపు దేవర షూట్ కొలిక్కి రావడంతో, ఆమె నటించడానికి అంగీకరించింది.
ఈ సినిమాకు సంబంధించి ఉత్తరాంధ్రలో నటీనటుల కోసం ఆడిషన్స్ నిర్వహించారు. నటీనటుల ఎంపిక పూర్తయిన వెంటనే సినిమా సెట్స్ పైకి వస్తుంది. మూవీ కోసం హైదరాబాద్ లో భారీ సెట్ వేస్తున్నారు. ఆ సెట్ లోనే షూట్ స్టార్ట్ అవుతుంది.