Telugu Global
Cinema & Entertainment

Itlu Maredumilli Prajaneekam: 2 రకాలుగా ట్రయిలర్ రిలీజ్

అల్లరి నరేష్ హీరోగా నటించిన సినిమా ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం. ఈ సినిమా ట్రయిలర్ ఈరోజు థియేటర్లలో రిలీజైంది.

Itlu Maredumilli Prajaneekam: 2 రకాలుగా ట్రయిలర్ రిలీజ్
X

అల్లరి నరేష్ నటించిన తాజా చిత్రం 'ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం'. ఈ నెల 25న థియేటర్లలోకి వస్తోంది. ఏఆర్ మోహన్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని జీ స్టూడియోస్‌ తో కలిసి హాస్య మూవీస్‌పై రాజేష్ దండా నిర్మిస్తున్నాడు. తాజాగా ఈ సినిమా ట్రయిలర్ ను రిలీజ్ చేశారు. అయితే ఇందులో 2 పద్ధతుల్ని ఫాలో అయ్యారు.

ఈరోజు 'ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం' థియేట్రికల్ ట్రయిలర్ ను విడుదల చేశారు. అయితే అది కేవలం థియేటర్లలో మాత్రమే. తెలుగు రాష్ట్రాల్లో నిర్దేశించిన కొన్ని థియేటర్లలో ఈ సినిమా ట్రయిలర్ ను ప్రదర్శిస్తున్నారు. అందుకే ఇది అందరికీ అందుబాటులోకి రాలేదు.

'ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం' థియేట్రికల్ ట్రైలర్ సమంత నటించిన 'యశోద', హాలీవుడ్ యాక్షన్-అడ్వెంచర్ బ్లాక్ పాంథర్: వాకండ ఫరెవర్ చిత్రాల్ని ప్రదర్శించే అన్ని థియేటర్లలో విడుదల చేశారు. ఇక యూట్యూబ్ లో రేపు ట్రయిలర్ ను లాంఛ్ చేస్తారు.

ట్రైలర్ రిలీజ్ పోస్టర్‌ లో అల్లరి నరేష్, అడవిలో గిరిజనులతో కలిసి నడుస్తూ సీరియస్‌గా కనిపిస్తున్నాడు, అతని పక్కనే ఒక వ్యక్తి నరేష్ చేయి పట్టుకుని రావడం కనిపిస్తోంది. పోస్టర్ లో విడుదల తేదీని కూడా చూపించారు. 25న 'ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం' రిలీజ్ అవుతుంది.

First Published:  11 Nov 2022 9:51 AM IST
Next Story