Telugu Global
Cinema & Entertainment

అల్లరి నరేష్ సినిమాకు రిలీజ్ డేట్ ఫిక్స్

అల్లరి నరేష్ తాజా చిత్రం ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం. ఈ సినిమాకు విడుదల తేదీ ఫిక్స్ అయింది.

Itlu Maredumilli Prajaneekam OTT: ఓటీటీలోకి అల్లరి నరేష్ మూవీ
X

Itlu Maredumilli Prajaneekam OTT: ఓటీటీలోకి అల్లరి నరేష్ మూవీ

అల్లరి నరేష్ హీరోగా మరో సీరియస్ మూవీ వస్తోంది. ఏఆర్ మోహన్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ మూవీ పేరు 'ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం'. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ లో ఉంది. జీ స్టూడియోస్‌తో కలిసి హాస్య మూవీస్‌పై రాజేష్ దండా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

ఈమధ్య రిలీజైన టీజర్‌కి ఓ మోస్తరు రెస్పాన్స్ వచ్చింది. సినిమా కథాంశాన్ని ఆవిష్కరించిన టీజర్ వీడియోలో అల్లరి నరేష్‌ ఎన్నో సవాళ్లను ఎదుర్కొని గిరిజన ప్రాంతమైన మారేడుమిల్లిలో ఎన్నికల విధులకు వచ్చిన ప్రభుత్వ అధికారి పాత్రలో కనిపించాడు.

తాజాగా సినిమా విడుదల తేదీని ప్రకటించారు మేకర్స్. 'ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం' నవంబర్ 11న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. అనౌన్స్‌మెంట్ పోస్టర్‌లో నరేష్, అతని సహచరులు, పోలీసు అధికారులతో కలిసి గిరిజన ప్రాంతంలో నడుస్తున్నారు.

ఆనంది హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రంలో వెన్నెల కిషోర్, ప్రవీణ్, సంపత్ రాజ్ ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు. శ్రీచరణ్ పాకాల సంగీతం అందిస్తున్నాడు. అబ్బూరి రవి మాటలు అందించగా, బ్రహ్మ కడలి ఆర్ట్ డైరెక్టర్ గా చోటా కె ప్రసాద్ ఎడిటర్ గా పని చేస్తున్నారు.

First Published:  30 Sept 2022 11:00 AM IST
Next Story