Telugu Global
Cinema & Entertainment

Itlu Maredumilli Prajaneekam OTT: ఓటీటీలోకి అల్లరి నరేష్ మూవీ

Itlu Maredumilli Prajaneekam OTT Release Date: అల్లరి నరేష్ హీరోగా నటించిన ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం సినిమా ఓటీటీలోకి వస్తోంది. ఈ సినిమా స్ట్రీమింగ్ కు డేట్ లాక్ చేసింది జీ5.

Itlu Maredumilli Prajaneekam OTT: ఓటీటీలోకి అల్లరి నరేష్ మూవీ
X

Itlu Maredumilli Prajaneekam OTT: ఓటీటీలోకి అల్లరి నరేష్ మూవీ

అల్లరి నరేష్ నటించిన చిత్రం ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం. మంచి సందేశంతో, సీరియస్ సబ్జెక్టుతో తెరకెక్కింది ఈ సినిమా. అయితే సరైన ప్రమోషన్ లేక సినిమా ఊపందుకోలేకపోయింది. అలా థియేటర్లలో ఫ్లాప్ అయిన ఈ సినిమా, ఇప్పుడు ఓటీటీలోకి వస్తోంది.

ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం సినిమాను జీ5లో స్ట్రీమింగ్ కు పెట్టబోతున్నారు. ఈనెల 23న శుక్రవారం నుంచి ఈ సినిమా అందుబాటులోకి వస్తుంది. అల్లరి నరేష్ ప్రభుత్వ ఉద్యోగిగా నటించిన ఈ సినిమా, కనీసం ఓటీటీలోనైనా క్లిక్ అవుతుందేమో చూడాలి.

ఏఆర్ మోహన్ దర్శకత్వంలో తెరకెక్కింది ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం సినిమా. జీ స్టుడియోస్, హాస్య మూవీస్ బ్యానర్లు సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమాలో ఆనంది హీరోయిన్ గా నటించింది. వెన్నెల కిషోర్, ప్రవీణ్, సంపత్ రాజ్, శ్రీతేజ్ లు కీలక పాత్రలు పోషించారు.

శ్రీచరణ్ పాకాల సంగీతం అందించిన ఈ సినిమా, థియేటర్లలో పెద్దగా రెస్పాన్స్ రాబట్టలేకపోయింది. ఆ టైమ్ లో వచ్చిన డబ్బింగ్ సినిమాల ధాటికి అల్లరోడి సినిమా నిలబడలేకపోయింది.

First Published:  20 Dec 2022 1:00 PM IST
Next Story