Telugu Global
Cinema & Entertainment

నిర్మాత దిల్‌ రాజు నివాసాల్లో ఐటీ సోదాలు

దిల్‌రాజు ఇళ్లతో పాటు ఆయన సోదరుడు శిరీశ్‌, కుమార్తె హన్సితరెడ్డి నివాసాల్లోనూ ఐటీ అధికారుల సోదాలు

నిర్మాత దిల్‌ రాజు నివాసాల్లో ఐటీ సోదాలు
X

టాలీవుడ్‌ సినిమా ఇండస్ట్రీపై ఐటీ దాడులు కలకలం సృష్టించాయి. హైదరాబాద్‌ నగరంలో ప్రముఖ నిర్మాతలు దిల్‌ రాజు చెందిన దిల్‌ రాజు ప్రొడక్షన్స్‌, శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌, పుష్ప-2 సినిమా నిర్మాత మైత్రి మూవీ మేకర్స్‌ భాగస్వామి నవీన్‌ ఎర్నేని ఇళ్లు, ఆఫీసుల్లో ఆదాయపు పన్ను శాఖ ఏకకాలంలో మొత్తం 8 చోట్ల ఏకకాలంలో సుమారు 200 మంది అధికారులతో 55 బృందాలుగా రంగంలోకి దిగి ఈ తెల్లవారు జాము నుంచి తనిఖీలు చేస్తున్నాయి.ప్రముఖ నిర్మాత, తెలంగాణ ఎఫ్‌డీసీ ఛైర్మన్‌ దిల్‌ రాజు ఇళ్లు, కార్యాలయాల్లో ఐటీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. ఏకకాలంలో 8 చోట్ల 55 బృందాలతో తనిఖీలు జరుగుతున్నాయి. జూబ్లీహిల్స్‌, బంజారాహిల్స్‌లో దిల్‌రాజు ఇళ్లతో పాటు ఆయన సోదరుడు శిరీశ్‌, కుమార్తె హన్సితరెడ్డి నివాసాల్లోనూ ఐటీ అధికారులు సోదాలు చేస్తున్నారు. వ్యాపార భాగస్వాముల నివాసాల్లోనూ తనిఖీలు నిర్వహిస్తున్నారు. వివిధ పత్రాలను అధికారులు పరిశీలిస్తున్నారు. మరోవైపు సింగర్‌ సునీత భర్త రామ్‌కు చెందిన మ్యాంగో మీడియా సంస్థ, దాని భాగస్వాముల ఇళ్లు, ఆఫీసులో అధికారులు తనిఖీ చేస్తున్నారు. మ్యాంగో మీడియా సంక్రాంతి పండుగ సందర్భంగా విడుదలైన డాకు మహారాజ్‌ సినిమాకు డిస్ట్రిబ్యూట్‌ చేసింది.

First Published:  21 Jan 2025 9:18 AM IST
Next Story