Telugu Global
Cinema & Entertainment

దిల్‌ రాజును ఎస్వీసీ ఆఫీస్‌కు తీసుకెళ్లిన ఐటీ అధికారులు ఎందుకంటే?

దిల్ రాజును సాగర్ సొసైటీలోని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ కార్యాలయానికి ఐటీ అధికారులు తీసుకెళ్లారు.

దిల్‌ రాజును ఎస్వీసీ ఆఫీస్‌కు తీసుకెళ్లిన ఐటీ అధికారులు ఎందుకంటే?
X

ప్రముఖ నిర్మాత, తెలంగాణ ఎఫ్‌డీసీ ఛైర్మన్ దిల్‌రాజును ఐటీ అధికారులు తీసుకెళ్లారు. దిల్ రాజు ఇంటి నుంచి కీలక డాక్యుమెంట్లులను ఐటీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు.ప్ర స్తుతం దిల్ రాజును సాగర్ సొసైటీలోని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ కార్యాలయానికి తీసుకెళ్లారు. ప్రస్తుతం ఎస్‌విసి కార్యాలయంలో కొనసాగుతున్నాయి ఐటీ సోదాలు. దీంతో దిల్‌ రాజు ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు. ఇక ఈ ఐటీ సోదాలపై ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది. దిల్ రాజు ఇంట్లో నాలుగు రోజులు పాటు కొనసాగాయి ఐటీ సోదాలు. దిల్ రాజు ఇంటి నుంచి కీలక డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్నారు.

ఇప్పటికే నిర్మాత రాజు ఇండ్లు, శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌ ఆఫీసుతోపాటు ఆయన వ్యాపార భాగస్వాముల నివాసాలతోపాటు మైత్రీ మూవీ మేకర్స్‌, మ్యాంగో మీడియా సంస్థలు, పుష్ప 2 డైరెక్టర్ సుకుమార్‌, దిల్‌ రాజు సోదరుడు శిరీశ్‌, కుమార్తె హన్సితరెడ్డి ఇండ్లలోనూ ఐటీ అధికారులు సోదాలు నిర్వహించారని తెలిసిందే. ఐటీ అధికారులు తనిఖీల్లో భాగంగా సినీ సంస్థలకు ఫైనాన్స్‌ చేస్తున్న వారి నివాసాలు, కార్యాలయాల్లో అధికారులు సోదాలు నిర్వహించారు. ఇప్పటికే నిర్మాత నెక్కంటి శ్రీధర్‌ నివాసంతోపాటు ఇటీవల విడుదలైన భారీ బడ్జెట్‌ సినిమాల ఇండ్లలో సోదాలు కొనసాగించారు. తమిళ హీరో విజయ్‌తో తెరకెక్కించిన వారిసు (వారసుడు) సినిమా రూ.120 కోట్లు మాత్రమే వసూళ్లు చేసిందని దిల్‌ రాజు ఐటీ అధికారులకు చెప్పినట్టు తెలిసింది. అంతేకాదు విజయ్‌కు రూ.40 కోట్లు రెమ్యునరేషన్‌ ఇచ్చామి.. ఈ సినిమాకు వచ్చిన నష్టాలను పూడ్చేందుకు డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లకు రూ.60 కోట్ల నష్టపరిహారం చెల్లించామని చెప్పినట్టు టాక్

First Published:  24 Jan 2025 12:35 PM IST
Next Story