Pushpa 2 | పుష్ప-2 వాయిదా పడుతుందా..? | Is Pushpa 2 be postponed again?
Telugu Global
Cinema & Entertainment

Pushpa 2 | పుష్ప-2 వాయిదా పడుతుందా..?

Pushpa 2 - బన్నీ-సుకుమార్ కాంబోలో వస్తోంది పుష్ప-2. ఇప్పుడీ సినిమా విడుదలపై కొత్త ఊహాగానాలు వినిపిస్తున్నాయి.

Pushpa 2 | పుష్ప-2 వాయిదా పడుతుందా..?
X

మైత్రీ మూవీ మేకర్స్ పుష్ప 2 చిత్రాన్ని స్వాతంత్ర్య దినోత్సవ కానుకగా, ఆగస్టు 15 విడుదల చేయబోతున్నట్టు గతంలో ప్రకటించింది. అల్లు అర్జున్ నటిస్తున్న ఈ భారీ యాక్షన్ ఎంటర్ టైనర్, అజయ్ దేవగన్ సింగంతో పోటీ పడాల్సి ఉంది. ఈ క్రమంలో పుష్ప-2తో పోటీని నివారించేందుకు, సింగం ను పోస్ట్ పోన్ చేసినట్టు గతంలో వార్తలొచ్చాయి. అయితే సింగం తప్పుకోలేదంట, ఇప్పుడు పుష్ప-2నే తప్పిస్తున్నారనే టాక్ వినిపిస్తోంది.

ఆగస్ట్ 15న లాంగ్ వీకెండ్ వచ్చింది. అది పుష్ప-2కు బాగా కలిసొస్తుంది. దీంతో భారీగా ఓపెనింగ్స్ వస్తాయని అల్లు అర్జున్ ఆర్మీ చాలా ఆశలు పెట్టుకుంది. కానీ తాజా ఊహాగానాలతో వాళ్లు కలవరపడుతున్నారు. పుష్ప సినిమా బాలీవుడ్ లో పెద్ద హిట్టయింది. అంతేకాదు, ఇది బన్నీకి జాతీయ అవార్డ్ కూడా తెచ్చిపెట్టింది. అలాంటి సినిమాకు సీక్వెల్ గా వస్తున్న పుష్ప-2ను మంచి వీకెండ్ నుంచి తప్పించడం ఆశ్చర్యమే.

సుకుమార్ సినిమాల విషయంలో ఇలాంటి ఊహాగానాలు ఎప్పుడూ ఉంటాయి. ఎందుకంటే, అతడు టార్గెట్ పెట్టుకొని పనిచేయడు. సినిమాను చెక్కుతుంటాడు. కాబట్టి, తాజా రూమర్స్ నిజమయ్యే అవకాశాలున్నాయని చాలామంది భావిస్తున్నారు. పుష్ప-2ను పంద్రాగస్ట్ నుంచి తప్పిస్తే, ఓ మంచి తేదీని యూనిట్ కోల్పోయినట్టే.

పుష్ప-2లో బన్నీ సరసన రష్మిక హీరోయిన్ గా నటిస్తోంది. ఫహాద్ ఫాజిల్ విలన్. దేవిశ్రీ ప్రసాద్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నాడు.

First Published:  3 Jan 2024 3:38 PM
Next Story