Telugu Global
Cinema & Entertainment

Mrunal Thakur | మృణాల్ ప్రేమలో పడిందా?

Mrunal Thakur - టాలీవుడ్ స్టార్ హీరోయిన్ మృణాల్ ఠాకూర్ ప్రేమలో పడిందా? ఓ సింగర్ తో డేటింగ్ చేస్తోందా?

Mrunal Thakur | మృణాల్ ప్రేమలో పడిందా?
X

మృణాల్ తొందరగా పెళ్లి చేసుకొని, హైదరాబాద్ కోడలిగా స్థిరపడాలని ఆకాంక్షించారు నిర్మాత అల్లు అరవింద్. ఆయన మాటలు నిజమయ్యేలా ఉన్నాయి. మృణాల్ ప్రస్తుతం ప్రేమలో ఉన్నట్టు తెలుస్తోంది. తాజాగా జరిగిన ఓ పార్టీ, ఈ పుకార్లకు వేదికగా మారింది.

బాలీవుడ్ సీనియర్ హీరోయిన్ శిల్పాశెట్టి, దీపావళి పార్టీ ఇచ్చింది. బాలీవుడ్ కు చెందిన చాలామంది ప్రముఖుల్ని ఆహ్వానించింది. ఈ పార్టీకి మృణాల్ కు కూడా ఆహ్వాన అందింది. అయితే ఆమె సోలోగా వెళ్లలేదు. సింగర్ బాద్షాతో కలిసి ఈ పార్టీకి వెళ్లింది.

పార్టీలో మృణాల్-బాద్షా ఇద్దరూ చాలా సన్నిహితంగా మెలిగారు. ఒకరి చేతిలో మరొకరు చేయి వేసి మరీ మాట్లాడుకున్నారు. పార్టీ తర్వాత కూడా ఇద్దరూ కలిసే బయటకు వెళ్లారు. దీంతో అతడితో ఆమె ప్రేమలో ఉన్నట్టు ఊహాగానాలు మొదలయ్యాయి.

మృణాల్-బాద్షా పరిచయం ఇప్పటిది కాదు. రెండేళ్ల నుంచి వాళ్లు క్లోజ్ గా ఉంటున్నారు. తను కంపోజ్ చేసిన బ్యాడ్ బాయ్ బ్యాడ్ గర్ల్ అనే మ్యూజిక్ ఆల్బమ్ కోసం మృణాల్ పని చేసింది. అప్పట్నుంచి ఇద్దరూ ఒకరికొకరు బాగా పరిచయం. ఇప్పుడు ఆ పరిచయం కాస్తా ప్రేమగా మారినట్టు కనిపిస్తోంది.

మృణాల్ వయసు 31 ఏళ్లు. ప్రస్తుతం టాలీవుడ్ లో స్టార్ స్టేటస్ ఎంజాయ్ చేస్తోంది. ఆమె చేతిలో క్రేజీ ప్రాజెక్టులున్నాయి. ఇలాంటి టైమ్ లో ఆమెపై డేటింగ్ రూమర్స్ వచ్చాయి. ప్రతి విషయాన్ని ఓపెన్ గా మాట్లాడే మృణాల్, ఈ అంశంపై కూడా స్పందిస్తుందేమో చూడాలి.

First Published:  14 Nov 2023 3:42 PM
Next Story