Intinti Ramayanam Movie OTT: ఇంటింటి రామాయణం ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్
Intinti Ramayanam OTT release date: థియేటర్లలో ఫ్లాప్ అయింది ఈ సినిమా. ఇప్పుడు ఓటీటీలో అలరించేందుకు రెడీ అయింది

Intinti Ramayanam Movie OTT: ఇంటింటి రామాయణం ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్
తాజాగా థియేటర్లలోకి వచ్చిన సినిమా ఇంటింటి రామాయణం. ప్రేమ, హాస్యం, ఉత్కంఠ సహా అన్ని అంశాల కలయికగా రూపొందిన చిత్రం ఇది. ‘ఆహా’ ఓటీటీ సమర్పణలో ఆహా స్టూడియోస్, సితార ప్రొడక్షన్స్ సంయుక్తంగా రూపొందించిన ‘ఇంటింటి రామాయణం’ సినిమా జూన్ 23 నుంచి ఆహాలో స్ట్రీమింగ్ కానుంది. తాజాగా ఈ విషయాన్ని వెల్లడించారు.
తెలంగాణ సంస్కృతి, సాంప్రదాయాలను తెలియజేసే చిత్రమే ‘ఇంటింటి రామాయణం’. సీనియర్ నటుడు నరేష్, రాహుల్ రామకృష్ణ, నవ్యా స్వామి, గంగవ్వ, బిత్తిరి సత్తి వంటి నటీనటులు ఈ సినిమాలో తమదైన నటనతో అలరించారు.
రాములు (నరేష్) చాలా మంచి మనసున్న వ్యక్తి. ఎదుటివారి పట్ల జాలి దయ, కరుణను కలిగి ఉండే స్వభావం తనది. అలాంటి వ్యక్తి కుటుంబానికి సంబంధించిన గొప్ప నిధి ఒకటి కనపడకుండా పోతుంది. దాంతో దాన్ని ఎవరు తీశారా? అనే కోణంలో రాములు అన్వేషణ చేస్తున్నప్పుడు అందరిపై అనుమానం కలుగుతుంది. రాములు కుమార్తె సంధ్య (నవ్యా స్వామి)ని ప్రేమించే కుర్రాడు శ్రీనివాస్ (రాహుల్ రామకృష్ణ)పై కూడా సందేహాన్ని రేకెత్తిస్తుంది. అయితే రాములు అసలు దోషిని కనిపెట్టటానికి నిరంతరం అన్వేషిస్తుంటాడు. చివరకు అసలు ఎవరా పని చేశారనేదే సినిమా. ఈ క్రమంలో పండే భావోద్వేగాలు చుట్టూ అల్లిన కథ ‘ఇంటింటి రామాయణం’.
తెలంగాణకు సంబంధించిన గొప్ప సాంస్కృతిక వారసత్వాన్ని, సాంప్రదాయాలను తెలియజేసేలా చక్కటి అభిరుచి, అంకిత భావంతో ‘ఇంటింటి రామాయణం’ చిత్రాన్ని రూపొందించారు. మంచి కథ, కథనాలతో పాటు నటీనటుల పెర్ఫామెన్స్‌లు, ఆకట్టుకునే విజువల్స్ ఈ సినిమాకు హైలెట్. థియేటర్లలో ఫ్లాప్ అయిన ఈ సినిమాను ఈనెల 23న ఆహాలో స్ట్రీమింగ్ కు పెడుతున్నారు.