Telugu Global
Cinema & Entertainment

ఆ ఉత్తరమే సీతారామం సినిమాకు స్ఫూర్తి

హను రాఘవపూడి దర్శకత్వంలో మరో డిఫరెంట్ మూవీ రాబోతోంది. ఈ సినిమాకు ఓ ఉత్తరం స్ఫూర్తి అంటున్నాడు ఈ దర్శకుడు. అదేంటో చూద్దాం

ఆ ఉత్తరమే సీతారామం సినిమాకు స్ఫూర్తి
X

దుల్కర్ సల్మాన్ హీరోగా నటిస్తున్న సినిమా సీతారామం. వైజయంతీ మూవీస్ బ్యాకప్ తో వస్తున్న ఈ సినిమాకు హను రాఘవపూడి దర్శకుడు. రెండు టైమ్ లైన్స్ లో నడిచే ఈ కథకు ఓ ఉత్తరం స్ఫూర్తి అంటున్నాడు రాఘవపూడి. ఆ ఉత్తరం కథేంటో, ఆయన మాటల్లోనే తెలుసుకుందాం..

"నాకు కోఠీ వెళ్లి పాత పుస్తకాలు కొనుక్కునే అలవాటు ఉంది. అలా కొనుక్కున్న పుస్తకంలో ఒక లెటర్ కనిపించింది. ఆ లెటర్ ను అప్పవరకు ఎవ్వరూ తెరవలేదు. అది ఓపెన్ చేస్తే పెద్ద మేటర్ ఏమీ లేదు. ఒక అబ్బాయికి వాళ్ళ అమ్మ రాసిన ఉత్తరం అది. అతను కనీసం దాన్ని ఓపెన్ కూడా చేయలేదు. ఇది నాకు చాలా ఆసక్తికరంగా అనిపించింది. ఒకవేళ అందులో చాలా ముఖ్యమైన విషయం ఉండి ఓపెన్ చేయకపోతే జర్నీ ఎలా ఉండేది? మనిషి జీవితాన్ని నిర్దేశించే విషయం కదా అనిపించింది. ఆ అలోచని కథగా రాశా."

అలా రాసిన కథే సీతారామం అంటున్నాడు హను రాఘవపూడి. ఇది పూర్తిగా ఫిక్షన్ కథ అని, కేవలం ఆ లెటర్ స్ఫూర్తితో రాసుకున్న స్టోరీ అని చెప్పుకొచ్చాడు. హను చెప్పిన మేటర్ బట్టి, ఈ సినిమాలో ఉత్తరం కీలక పాత్ర పోషిస్తుందనే విషయం అర్థమౌతుంది.

మృణాళినీ ఠాకూర్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమాలో రష్మిక కీలక పాత్ర పోషిస్తోంది. మరికొన్ని కీలక పాత్రల్లో సుమంత్, భూమిక కనిపించబోతున్నారు. మొన్నటివరకు లిరికల్ వీడియో రిలీజ్ చేస్తూ, సినిమాకు ప్రచారం కల్పించారు. ఇప్పుడు యూనిట్ రంగంలోకి దిగింది. మీడియాకు వరుసగా ఇంటర్వ్యూలు ఇస్తోంది. ఇందులో భాగంగా ఈ సినిమాకు ఓ ఉత్తరం ఆధారమనే విషయాన్ని దర్శకుడు బయటపెట్టాడు.

First Published:  24 July 2022 8:02 AM
Next Story