Telugu Global
Cinema & Entertainment

అదనపు షోలు లేకపోతే బెస్ట్ సినిమాలు తీయటం కష్టం : మురళీ మోహన్‌

టికెట్ ధరలు పెంపు, అదనపు షోలు లేకపోతే బెస్ట్ సినిమాలు తీయటం కష్టమేనని నటుడు మురళీ మోహన్‌ అన్నారు

అదనపు షోలు లేకపోతే బెస్ట్ సినిమాలు తీయటం కష్టం : మురళీ మోహన్‌
X

తెలంగాణలో ప్రపంచ స్థాయి సినిమాలు తీయాలంటే భారీ ఖర్చు తప్పదని ఓ ఇంటర్య్వులో నిర్మాత మురళీ మోహన్‌ అన్నారు. టికెట్ ధరలు పెంపు, అదనపు షోలు లేకపోతే సినిమాలు తీయటం కష్టమేనని ఆయన అన్నారు. మూవీ రిలీజ్ అయిన వారం రోజుల్లోనే ఖర్చును రాబట్టుకోవాలి. అదనపు షోలు వేయడం ఇతర చిత్ర పరిశ్రమల్లోనూ ఉంది. అదనపు షోలు వేయలేకపోతే నిర్మాత ఖర్చు పెట్టలేడు. చిత్ర పరిశ్రమ సమస్యలను సీఎం రేవంత్‌రెడ్డి దృష్టికి తీసుకెళ్లాం.

ముఖ్యమంత్రి చాలా సానుకూలంగా మా విన్నపాలను ఆలకించారు’’ అన్నారు. బెనిఫిట్ షోకు చిత్ర యూనిట్ వెళ్లకపోతే సినిమాను అంచనా వేయలేం. సంధ్య థియేటర్ వద్ద చోటుచేసుకున్న ఘటన దురదృష్టకరంమన్నారు. త్వరలోనే ఏపీ ప్రభుత్వం దగ్గరకు టాలీవుడ్ బృందం వెళ్తుంది. నంది అవార్డుల అంశంపై డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌తో మాట్లాడాలని ఏపీ సీఎం చంద్రబాబు నాకు సూచించారు.

First Published:  26 Dec 2024 7:49 PM IST
Next Story