Telugu Global
Cinema & Entertainment

అంజలికి జాతీయ అవార్డు వస్తుందనుకుంటున్నా

'గేమ్‌ ఛేంజర్‌' మూవీ గురించి ఆసక్తికర విషయాలు షేర్‌ చేసుకున్న మ్యూజిక్‌ డైరెక్టర్‌ తమన్‌

అంజలికి జాతీయ అవార్డు వస్తుందనుకుంటున్నా
X

రామ్‌ చరణ్‌ హీరోగా డైరెక్టర్‌ శంకర్‌ తెరకెక్కిస్తున్న మూవీ 'గేమ్‌ ఛేంజర్‌'. కియారా అద్వానీ హీరోయిన్‌. అంజలి, శ్రీకాంత్‌, నవీన్‌ చంద్ర, ఎస్‌జే సూర్య తదితరులు కీలక పాత్రలు పోషించారు. ప్రముఖ నిర్మాత దిల్‌ రాజు నిర్మించిన ఈ 50 వ సినిమా 2025 జనవరి 10న విడుదల కానున్నది. ఈ సందర్భంగా మ్యూజిక్‌ డైరెక్టర్‌ ఎక్స్‌ వేదికగా మీడియా, అభిమానులతో చిట్‌చాట్‌లో పాల్గొని, పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నారు.

'గేమ్‌ ఛేంజర్‌' అన్ని అంశాల్లోనూ భారీ సినిమా. పాటలన్నింటినీ 2021 డిసెంబర్‌లోపే పూర్తి చేశాను. శంకర్‌ సార్‌ మూవీకి అంతవేగంగా కంపోజింగ్‌ అయిపోతుందని నేను ఎప్పుడూ అనుకోలేఉద. అవి బైటికి రాకుండా చాలా జాగ్రత్త పడ్డాం. వాటి చిత్రీకరణ విషయంలో శంకర్‌, నిర్మాత దిల్‌ రాజు ఎక్కడా రాజీపడలేదు. 'జరగండి జరగండి' పాట అద్భుతం. కళ్ల జోడు లేకుండానే 3డీ చూసినట్టు ఉంటుంది.

ఇందులో ఆరు పాటలున్నాయి. జనవరి 4న రెండు సాంగ్స్‌ విడుదల చేయనున్నాం. రిలీజ్‌కు మరో బిట్‌ సాంగ్‌ (డ్యాన్స్‌కు ప్రాధాన్యం ఉన్న పాట) కూడా ఉంది. ఆయనతో కలిసి పని చేయాలనే నా డ్రీమ్‌ ఈ మూవీతో నెరవేరింది. ఈ సినిమాతో శంకర్‌ ఎడిటింగ్‌ విషయంలో కొత్త ట్రెండ్‌ సెట్‌ చేయబోతున్నారు. మూవీ సెకాండాఫ్‌ రేసీగా ఉంటుంది. రామ్‌ చరణ్‌ స్క్రీన్‌ ప్రెజెన్స్‌ అదుర్స్‌. ఫ్లాష్‌బ్యాక్‌ ఎపిసోడ్‌లో చరణ్‌, అంజలి పాత్రకు ప్రశంసలు దక్కుతాయి. అంజలికి జాతీయ అవార్డు వస్తుందనుకుంటున్నాను. ఇండియన్‌2 ఫలితంపై కొద్దిగా నిరాశ చెందిన డైరెక్టర్‌ శంకర్‌ 'గేమ్‌ ఛేంజర్‌'తో హిట్‌ కొట్టేస్తారని తమన్‌ ఆశాభావం వ్యక్తం చేశారు.

First Published:  31 Dec 2024 11:43 PM IST
Next Story