Telugu Global
Cinema & Entertainment

Sairam Shankar | నా కెరీర్ లో గ్యాప్ రాలేదు

Sairam Shankar - తన కెరీర్ లో గ్యాప్ రాలేదంటున్నాడు సాయిరాం శంకర్. 3 సినిమాలు చేతిలో ఉన్నట్టు వెల్లడించాడు.

Sairam Shankar | నా కెరీర్ లో గ్యాప్ రాలేదు
X

సాయిరామ్ శంకర్, యషా శివకుమార్, హెబ్బా పటేల్ హీరో హీరోయిన్లుగా సాయి తేజ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై నవీన్ రెడ్డి దర్శకత్వంలో దేవరాజ్ పోతూరు నిర్మించిన చిత్రం ‘వెయ్ దరువెయ్’. రేపు ఈ సినిమాను గ్రాండ్ గా రిలీజ్ చేస్తున్నారు. ఈ సందర్భంగా హీరో సాయిరామ్ శంకర్ సినిమా గురించి మాట్లాడాడు. మరీ ముఖ్యంగా తన కెరీర్ లో గ్యాప్ రాలేదని చెబుతున్నాడు.

"నేను వరుస సినిమాలు చేస్తున్నాను. అయితే అవన్నీ రిలీజ్‌కి సిద్ధమవుతున్నాయి. మార్చి 15న ‘వెయ్ దరువెయ్’ రిలీజ్ అయితే వచ్చే నెలలో ఒక పథకం ప్రకారం, మే నెలలో రీసౌండ్ రిలీజ్ అవుతుంది. ఈ 3 మూవీస్ చేయటానికి ఐదేళ్ల సమయం పట్టింది. అందుకు కారణం మధ్యలో కోవిడ్ చాలా డిస్ట్రబ్ చేసింది."

అలా కొన్ని పరిస్థితుల వల్ల తన కెరీర్ లో గ్యాప్ వచ్చినట్టు కనిపిస్తోంది తప్ప, నిజానికి తనకు గ్యాప్ లేదని అంటున్నాడు సాయిరాం శంకర్. లాంగ్ గ్యాప్ తర్వాత వస్తున్న వెయ్ దరువెయ్ సినిమా తనకు కచ్చితంగా సక్సెస్ తెచ్చిపెడుతుందని అంటున్నాడు.

ఇక అన్నయ్య పూరి జగన్నాధ్ డైరక్షన్ పై స్పందిస్తూ.. తనతో సినిమా చేయమని అన్నయ్యను ఇబ్బంది పెట్టనని, తనతో ఏది బాగుంటుందో అన్నయ్యకు తెలుసని, ఆ టైమ్ వచ్చినప్పుడు కచ్చితంగా తనతో సినిమా చేస్తాడని అన్నాడు. ప్రమోషన్ విషయంలో కూడా తనకు అవసరమని అన్నయ్య భావిస్తే కచ్చితంగా ప్రచారం చేస్తాడని అన్నాడు.

First Published:  14 March 2024 10:46 PM IST
Next Story