Telugu Global
Cinema & Entertainment

Ustaad Bhagat Singh - పవన్ కోసం భారీ సెట్ నిర్మాణం

Ustaad Bhagat Singh - ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా కోసం భారీ సెట్ వేస్తున్నారు. ఆనంద్ సాయి నేతృత్వంలో వేస్తున్న ఈ సెట్ లోనే మేజర్ పార్ట్ షూటింగ్ జరుగుతుంది.

Ustaad Bhagat Singh - పవన్ కోసం భారీ సెట్ నిర్మాణం
X

గబ్బర్ సింగ్ వంటి భారీ బ్లాక్ బస్టర్ తర్వాత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, బ్లాక్ బస్టర్ డైరెక్టర్ హరీష్ శంకర్ రెండవ సారి చేతులు కలిపారు. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై రవిశంకర్, నవీన్ యెర్నేని ఈ చిత్రాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. ఈ డెడ్లీ కాంబినేషన్‌లో రూపొందుతున్న 'ఉస్తాద్ భగత్ సింగ్' నెక్స్ట్ షూటింగ్ షెడ్యూల్ త్వరలో హైదరాబాద్‌లో ప్రారంభం కానుంది.

ప్రస్తుతం ప్రొడక్షన్ డిజైనర్ ఆనంద్ సాయి పర్యవేక్షణలో ఉస్తాద్ భగత్ సింగ్ కీలక షెడ్యూల్ కోసం భారీ సెట్‌ను నిర్మిస్తున్నారు. ఈ కీలక షెడ్యూల్‌లో పవన్ కళ్యాణ్‌తో పాటు సినిమాలోని ఇతర ప్రముఖ తారాగణం పాల్గొంటారు.

ఈ చిత్రం ఫస్ట్ లుక్, మొదటి ఫస్ట్ గ్లింప్స్ కు అద్భుతమైన స్పందన వచ్చింది. పవన్ కళ్యాణ్ పోలీస్ ఆఫీసర్‌గా మాస్, ఎనర్జిటిక్, డైనమిక్ క్యారెక్టర్‌లో కనిపించడం అభిమానులని అలరించింది. ఈ చిత్రంలో మోస్ట్ హ్యాపెనింగ్ హీరోయిన్ శ్రీలీల హీరోయిన్‌గా నటిస్తుండగా, అశుతోష్ రానా, నవాబ్ షా కీలక పాత్రల్లో నటిస్తున్నారు.

ఈ చిత్రం కోసం అగ్రశ్రేణి సాంకేతిక బృందం పని చేస్తోంది. అయనంక బోస్ సినిమాటోగ్రఫీ అందిస్తుండగా ఆనంద్ సాయి ఆర్ట్ డైరెక్టర్ గా, ఛోటా కె ప్రసాద్‌ ఎడిటర్ గా పని చేస్తున్నారు. జల్సా, గబ్బర్ సింగ్, అత్తారింటికి దారేది, పుష్ప, రంగస్థలం వంటి హిట్ చిత్రాల స్వరకర్త దేవిశ్రీ ప్రసాద్ సంగీతం సమకూరుస్తున్నారు.

ప్రస్తుతం పవన్ కల్యాణ్ బ్రో, ఓజీ సినిమాల పనుల్లో బిజీగా ఉన్నారు. బ్రో సినిమాకు సంబంధించి స్పెషల్ సాంగ్ షూట్ మాత్రం పెండింగ్ ఉంది. అది కంప్లీట్ అయిన తర్వాత ఉస్తాద్ సెట్స్ పైకి వస్తారు.

First Published:  6 Jun 2023 4:39 PM IST
Next Story