Telugu Global
Cinema & Entertainment

Weekend Release: పోటీ ఆ 2 సినిమాల మధ్యే..!

Weekend Release: ఈ వీకెండ్ 6 సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. వీటిలో ప్రధానంగా మట్టి కుస్తీ, హిట్-2 సినిమాల మధ్య పోటీ ఉంది.

Weekend Release: పోటీ ఆ 2 సినిమాల మధ్యే..!
X

ఎప్పట్లానే ఈ వీకెండ్ కూడా అరడజను సినిమాలు రిలీజ్ కు రెడీ అయ్యాయి. అయితే వీటిలో ప్రధానంగా పోటీ మాత్రం 2 సినిమాల మధ్య మాత్రమే కొనసాగనుంది. ఆ రెండు సినిమాలేంటో చెక్ చేద్దాం.

ఈ వీకెండ్ ఎట్రాక్షన్ గా థియేటర్లలోకి వస్తోంది హిట్-2. అడివి శేష్ హీరోగా నటించిన సినిమా ఇది. సూపర్ హిట్టయిన HIT సినిమాకు సీక్వెల్ గా వస్తోంది. పైగా నాని నిర్మాత. భారీ ప్రమోషన్. ట్రయిలర్ ఇదివరకే పెద్ద సక్సెస్. ఇలా ఎక్కడా తగ్గకుండా వస్తోంది హిట్-2.

హిట్-2కు పోటీగా వస్తోంది మట్టి కుస్తీ. హిట్-2కు నాని నిర్మాత అయితే, మట్టి కుస్తీకి రవితేజ నిర్మాత. విష్ణు విశాల్ హీరోగా నటించాడు. స్పోర్ట్స్ డ్రామాకు, ఫ్యామిలీ ఎలిమెంట్స్ మిక్స్ చేసి తెరకెక్కించిన సినిమా ఇది. స్వయంగా రవితేజ రంగంలోకి దిగడంతో, ఈ మూవీపై కూడా ఓ మోస్తరుగా అంచనాలు పెరిగాయి.

ఈ శుక్రవారం, ఈ రెండు సినిమాల మధ్య మాత్రమే ప్రధానంగా పోటీ ఉండనుంది. దోస్తాన్, నేనెవరు, జల్లికట్టు బసవ, మట్టి దెయ్యాలు అంటూ మరికొన్ని సినిమాలు థియేటర్లలోకి వస్తున్నప్పటికీ వాటి ప్రభావం పెద్దగా బాక్సాఫీస్ పై ఉండకపోవచ్చు.

First Published:  30 Nov 2022 6:52 AM
Next Story