మెట్లపై నుంచి జారిపడ్డ హీరో విజయ్ దేవరకొండ
టాలీవుడ్ హీరో విజయ్ దేవరకొండ ఓ బిల్డింగ్ నుంచి బయటకు వెళ్తుండగా మెట్లపై నుంచి జారిపడ్డాడు
BY Vamshi Kotas8 Nov 2024 4:49 PM IST
X
Vamshi Kotas Updated On: 8 Nov 2024 4:49 PM IST
టాలీవుడ్ హీరో విజయ్ దేవరకొండ మెట్లపై నుంచి జారిపడ్డాడు. ముంబైలో ఓ కార్యక్రమానికి హాజరై మెట్లపై నుంచి వస్తుండగా దేవరకొండ కాలు స్లిప్ అయి కిందపడ్డాడు. ఈ వీడియో రికార్డ్ చేయుద్దని ఆయన టీమ్ చేతులు జోడిస్తూ వేడుకుంది. విజయ్‌కు ఎటువంటి గాయాలూ కాకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.
ఆ తరువాత అభిమానులతో ఫొటోలు దిగుతూ కనిపించాడు. కానీ పెద్దగా గాయపడలేదు, వెంటనే లేచి బయటకు వచ్చాడు. ముంబైలో మితిబాయి క్షితిజ్ లో పాల్గొనేందుకు వెళ్లిన సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ప్రస్తుతం గౌతమ్ తిన్ననూరి డైరెక్షన్లో ఓ రస్టిక్ మూవీలో నటిస్తున్నారు.
Next Story