Telugu Global
Cinema & Entertainment

Varun Dhawan | తండ్రి అయిన హీరో

Varun Dhawan | బాలీవుడ్ హీరో వరుణ్ ధావన్ తండ్రి అయ్యాడు. దీంతో అతడి ఇంట్లో పండగ వాతావరణం నెలకొంది.

Varun Dhawan | తండ్రి అయిన హీరో
X

హీరో వరుణ్ ధావన్ తండ్రి అయ్యాడు. అతడి భార్య నటాషా పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. తనకు పాప పుట్టిందని, ప్రస్తుతం తల్లీకూతురు క్షేమంగానే ఉన్నారంటూ వరుణ్ ధావన్ సోషల్ మీడియా వేదికగా పోస్టు పెట్టాడు.

దాదాపు ఐదేళ్లు ప్రేమించుకొని పెళ్లి చేసుకున్నారు వరుణ్ ధావన్, నటాషా. ఫ్యాషన్ డిజైనర్ అయిన నటాషా, కొన్నేళ్ల పాటు వరుణ్ ధావన్ కు దుస్తులు డిజైన్ చేసింది. అలా వీళ్ల పరిచయం మొదలైంది. 2021లో ఇద్దరూ పెళ్లి చేసుకున్నారు. కరోనా కారణంగా సింపుల్ గా వీళ్ల జరిగింది. ఇప్పుడు ఇద్దరూ తల్లిదండ్రులుగా మారారు.

డేవిడ్ ధావన్ వారసుడిగా ఇండస్ట్రీలో అడుగుపెట్టాడు వరుణ్ ధావన్. ముందుగా చిన్న చిన్న పాత్రలు చేస్తూ, కెరీర్ ను నిర్మించుకున్న ఈ నటుడు, ఆ తర్వాత హీరో పాత్రల్లోకి మారాడు. ప్రస్తుతం బేబీ జాన్ అనే సినిమాలో నటిస్తున్నాడు. ఈ మూవీ విడుదలకు సిద్ధమైంది. దీంతో పాటు సమంతతో కలిసి సిటాడెల్ అనే వెబ్ సిరీస్ చేశాడు. త్వరలోనే ఇది స్ట్రీమింగ్ కాబోతోంది.

First Published:  5 Jun 2024 10:35 PM IST
Next Story