Telugu Global
Cinema & Entertainment

Sharwanand | ఒక్క రోజు కూడా గ్యాప్ ఇవ్వలేదు

Sharwanand - శర్వానంద్ హీరోగా నటించిన మనమే సినిమా థియేటర్లలోకి వచ్చింది. మరి శర్వానంద్ ఇప్పుడేం చేస్తున్నాడు? అతడు ఆల్రెడీ మరో సినిమా స్టార్ట్ చేశాడు.

Sharwanand | ఒక్క రోజు కూడా గ్యాప్ ఇవ్వలేదు
X

కొంతమంది హీరోలు కెరీర్ లో గ్యాప్ ఇవ్వరు. హిట్స్-ఫ్లాప్స్ తో సంబంధం లేకుండా సినిమాలు చేస్తూనే ఉంటారు. హీరోలు రామ్, శర్వానంద్, గోపీచంద్ లాంటి చాలామంది ఈ లిస్ట్ లోకి వస్తారు. ఇప్పుడు వీళ్లలో శర్వానంద్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. అతడు నటించిన మనమే సినిమా శుక్రవారం థియేటర్లలోకి వచ్చింది.

అప్పటివరకు ఈ సినిమా ప్రచారంలో బిజీగా గడిపిన శర్వానంద్, సినిమా రిలీజైన రోజునే, మరో సినిమా సెట్స్ లో అడుగుపెట్టాడు. శర్వానంద్ తన తదుపరి ప్రాజెక్ట్ ను రామ్ అబ్బరాజు దర్శకత్వంలో చేయబోతున్నాడు. ఆ సినిమా రెగ్యులర్ షూటింగ్ ను హైదరాబాద్ లో ప్రారంభించాడు. శర్వానంద్, సంయుక్త మీనన్ పై కొన్ని సన్నివేశాలు తెరకెక్కిస్తున్నారు.

ఇలా కీలకమైన హీరోహీరోయిన్లు ఇద్దరూ సెట్స్ పైకి వచ్చారు. ఈ చిత్రంలో సాక్షి వైద్య మరో హీరోయిన్ గా నటిస్తోంది. ఏజెంట్ సినిమాతో ఆమె గుర్తింపు తెచ్చుకున్న సంగతి తెలిసిందే. ఎకె ఎంటర్‌టైన్‌మెంట్స్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి విశాల్ చంద్రశేఖర్ సంగీతం అందిస్తున్నాడు. ఈ ప్రాజెక్ట్‌కి సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలోనే తెలుస్తాయి.

ఒక ఒక జీవితం సినిమాతో సక్సెస్ కొట్టాడు శర్వానంద్. ఈ సినిమాకు ముందు అతడు వరుసగా ఫ్లాప్స్ ఇచ్చాడు. ఒకే ఒక జీవితం సక్సెస్ ను అలానే కొనసాగించాలనే ఉద్దేశంతో బ్యాక్ టు బ్యాక్ మూవీస్ చేస్తున్నాడు. అతడు తాజాగా నటించిన మనమే సినిమాకు థియేటర్లలో మంచి రెస్పాన్స్ వస్తోంది.

First Published:  8 Jun 2024 5:13 PM GMT
Next Story