మీ ఓటు నాకే వేయండి.. హీరో నాని ట్వీట్ వైరల్
నాని చేసిన ఈ పోస్ట్ ప్రస్తుతం నెటిజన్లను బాగా ఆకట్టుకుంటోంది. నాని రాజకీయ నాయకుడి గెటప్ లో భలేగా ఉన్నాడంటూ .. కామెంట్లు చేస్తున్నారు.

సినిమాలకంటూ ఒక ట్రెండ్ మొదటి నుంచి ఉన్న సంగతి తెలిసిందే. ఓసారి ఫ్యాక్షన్ చిత్రాలు, మరోసారి ప్రేమకథా చిత్రాలు, ఇంకొకసారి హర్రర్ చిత్రాలు.. ఇలా ఒక్కో ట్రెండులో ఒక్కో టైప్ సినిమాలు థియేటర్లకు క్యూలు కడుతుంటాయి. అయితే ఎన్నికల సమయం వచ్చేసరికి సినిమాల పరంగా ఏ ట్రెండు ఉన్నా ప్రజలను మేల్కొల్పే చైతన్యవంతమైన సినిమాలు, కొన్ని పార్టీలకు, రాజకీయ నాయకులకు అనుకూలమైన సినిమాలు కూడా వస్తుంటాయి.
అయితే ప్రతిసారి ఎన్నికల సమయంలో వచ్చే రాజకీయపరమైన సినిమాలు ఈ దఫా ఎందుకో రావడం లేదు. కారణం ఏంటో తెలియదు కానీ, ప్రస్తుతం తెలంగాణలో ఎన్నికల హడావుడి ఉన్నప్పటికీ రాజకీయ నేపథ్యంలో సినిమాలు అయితే రావడం లేదు.
ఈ సిట్యువేషన్‌ను క్యాష్ చేసుకోవడానికి హీరో నాని ముందుకు వచ్చాడు. ప్రస్తుతం ఆయన 'హాయ్ నాన్న' అనే సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో నాని సరసన మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా నటిస్తుండగా, డెబ్యూ డైరెక్టర్ శౌర్యువ్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ మూవీ వచ్చేనెల 7న ప్రేక్షకుల ముందుకు రానుంది. దీంతో హీరో నాని ఈ సినిమాకు సంబంధించిన ప్రమోషన్లు జోరుగా నిర్వహిస్తున్నాడు.
Since it’s all elections mood around. Why not join the madness :)
— Nani (@NameisNani) November 17, 2023
December 7th మీ ప్రేమ మరియు vote మాకే అవ్వాలని ;)
Mee #HiNanna party president
Viraj
( few fun campaigning specials will follow ) pic.twitter.com/QdtR6YKmDa
ఇందులో భాగంగా తాజాగా ఆయన సోషల్ మీడియాలో ఓ ఫొటో పోస్ట్ చేశాడు. ఆ ఫొటోలో నాని ఎలా ఉన్నాడంటే.. ఫక్తు రాజకీయ నాయకుడి గెటప్‌లో ఉన్నాడు. ఖద్దరు దుస్తులు ధరించి, మెడలో పార్టీ కండువా వేసుకొని రెండు చేతులు జోడించి నమస్కరిస్తున్నాడు. ఫొటో కింద ఓ టెక్స్ట్ కూడా రాశాడు. 'ఇది ఎన్నికల సీజన్. ఇందులో మనం ఎందుకు జాయిన్ కాకూడదు. డిసెంబర్ 7న మీ ప్రేమను మాకు ఇవ్వాలి. మీ ఓటు మాకే వేయాలి. ఇట్లు.. మీ హాయ్ నాన్న పార్టీ ప్రెసిడెంట్ విరాజ్' అని పోస్ట్ చేశాడు.
నాని చేసిన ఈ పోస్ట్ ప్రస్తుతం నెటిజన్లను బాగా ఆకట్టుకుంటోంది. నాని రాజకీయ నాయకుడి గెటప్ లో భలేగా ఉన్నాడంటూ .. కామెంట్లు చేస్తున్నారు. ఎన్నికల వేడిని నాని తన ప్రచారం కోసం వాడుకోవడం మాత్రం అందరినీ ఆకట్టుకుంటోంది.
♦