Telugu Global
Cinema & Entertainment

షూటింగ్‌‌లో గాయపడ్డ హీరో కార్తీ

తమిళ స్టార్ హీరో కార్తీకి షూటింగ్ లో ప్రమాదం జరిగింది.

షూటింగ్‌‌లో గాయపడ్డ హీరో కార్తీ
X

తమిళ స్టార్ హీరో కార్తీ సర్దార్-2 షూటింగ్‌లో గాయపడ్డారు. మైసూరులో ఈ సినిమా సంబంధించి కీలక సన్నివేశాలు చిత్రకరిస్తుండగా ఆయన కాలికి గాయమైంది. ఈ సినిమాలోని పలు కీలక ఛేజింగ్ సన్నివేశాలు ఘాట్ చేస్తుండగా.. కార్తీ కాలికి గాయం అయినట్లు తెలుస్తోంది. నడవలేని స్థితిలో ఉన్న కార్తీని వెంటనే చిత్ర బృందం ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు.

చికిత్స అనంతరం 2 వారాల విశ్రాంతి అవసరం అని వైద్యులు సూచించారు. దీంతో ఆయన చెన్నై వెళ్లిపోవడంతో షూటింగ్ నిలిచిపోయింది. పీఎస్ మిత్రన్ దర్శకత్వంలో స్పై, యాక్షన్ థ్రిల్లర్ గా వస్తున్న ఈ సినిమాలో కార్తీ డ్యూయెల్ రోల్ చేస్తున్నాడు. మాళవికా మోహన్, ఆషికా రంగనాథ్, ఎస్జే సూర్యలు ప్రధాన పత్రాలు పోషిస్తున్నారు.

First Published:  4 March 2025 5:28 PM IST
Next Story