నటి పావలా శ్యామలకు హీరో ఆకాశ్ పూరి ఆర్థిక సాయం
యంగ్ హీరో ఆకాశ్ పూరి నటి పావలా శ్యామలకు ఆర్థిక సాయం చేసి పెద్ద మనసు చాటుకున్నాడు.
BY Vamshi Kotas18 Jan 2025 8:48 PM IST
X
Vamshi Kotas Updated On: 18 Jan 2025 8:48 PM IST
సీనియర్ నటి పావలా శ్యామలకు దర్శకుడు పూరి జగన్నాథ్ కొడుకు యంగ్ హీరో ఆకాశ్ పూరి ఆమెకు ఆర్ధిక సాయాన్ని అందించారు. . నటి పావలా శ్యామల ఇటీవల తన దీన స్థితిని వివరిస్తూ.. సోషల్ మీడియా వేదికగా ఓ వీడియో రిలీజ్ చేశారు. తన ఆర్థిక పరిస్థితి బాగాలేదని, ఆసుపత్రిలో చూపించుకునేందుకు డబ్బులు లేవని ఆవేదన వ్యక్తం చేశారు. అంతేగాక పెద్ద పెద్ద హీరోలతో నటించి, ఇప్పుడు ఏ దిక్కూ లేక ఆత్మహత్య చేసుకునే స్థితిలో ఉన్నానని చెప్పారు. దయచేసి ఎవరైనా తనను ఆదుకోవాలని శ్యామల వీడియో ద్వారా కోరుకుంది. శ్యామలను కలిసి ఆమె బాగోగులు తెలుసుకొని రూ. 1 లక్ష చేతికి అందించారు. ఏ కష్ట్రం వచ్చిన తాను ఉన్నానంటూ భరోసా కల్పించారు. గతంలో మెగాహీరో సాయి దుర్గ తేజ్ కుడా ఆర్ధిక సాయం చేశారు.
Next Story