మొన్న యాక్సిడెంట్.. నేడు థర్డ్ ప్రైజ్!
దుబయ్ కార్ రేస్‌లో హీరో అజిత్ టీమ్ కు స్పిరిట్ ఆఫ్ ది రేస్ అవార్డు

కోలీవుడ్ హీరో అజిత్ కు యాక్సిడెంట్.. రేసింగ్ ట్రాక్‌పై రయ్యిమని దూసుకెళ్తూ ట్రాక్ పక్కనే ఉన్న గోడను ఢీకొట్టడంతో అజిత్ కు గాయాలు.. ఆయన అభిమానులను కలవరపరిచిన వార్త ఇది.. అయితే తన అభిమానులు పండుగ చేసుకునే గుడ్ న్యూస్ చెప్పారు అజిత్. 24హెచ్ దుబయి కార్ రేసింగ్ లో ''అజిత్ కుమార్ రేసింగ్ బై బీకేఆర్'' థర్డ్ ప్లేస్ లో నిలిచింది. దుబయి వేదికగా జరిగిన ఈ రేసులో థర్డ్ ప్లేస్ తో పాటు స్పిరిట్ ఆఫ్ ది రేస్ అవార్డును కూడా అజిత్ టీమ్ సొంతం చేసుకుంది. అజిత్ కు, ఆయన టీమ్ కు అభినందనలు తెలుపుతూ పలువురు ఎక్స్‌లో పోస్టులు పెట్టారు. రేసులో అజిత్ టీమ్ విజయం సాధించిన వీడియోలు, ఫొటోలు షేర్ చేశారు. అజిత్ కు కార్, బైక్ రేసింగ్‌లు అంటే ఎంతో ఇష్టం. మొదటిసారి ఆయన రేసింగ్ ఈవెంట్‌లో పాల్గొన్నాడు. ప్రమాదాన్ని పక్కనపెట్టి కలిసికట్టుగా శ్రమించి మూడో స్థానం దక్కించుకున్నారు.