నేడు అల్లు అర్జున్ బెయిల్ పిటిషన్‌పై విచారణ.. సర్వత్రా ఉత్కంఠ
అల్లు అర్జున్ రెగ్యులర్ బెయిల్ పిటిషన్‌పై ఇవాళ మరోసారి నాంపల్లి కోర్టు విచారణ చేపట్టనుంది
BY Vamshi Kotas30 Dec 2024 10:18 AM IST
X
Vamshi Kotas Updated On: 30 Dec 2024 10:18 AM IST
సంధ్య థియేటర్ తొక్కిసలాట కేసులో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పిటిషన్‌పై నేడు నాంపల్లి కోర్టులో విచారణ జరగనుంది. ఈ పిటిషన్‌పై తెలంగాణ పోలీసులు కౌంటర్ దాఖలు చేయనున్నారు. బన్నీ లీగల్ టీమ్ నాంపల్లి కోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చేయగా సోమవారానికి విచారణను వాయిదా వేసింది. నేడు ఆ బెయిల్ పిటిషన్‌పై నాంపల్లి కోర్టు విచారణ చేపడుతోన్న తరుణంలో అల్లు అర్జున్ రెగ్యులర్ బెయిల్ వస్తుందా.. రాదా అనే ఫ్యాన్స్.. ఇటు సినీ ప్రముఖుల్లో ఉత్కంఠ నెలకొంది. అయితే, హైకోర్ట్ మధ్యంతర బెయిల్‌పై ఉన్న అల్లు అర్జున్‌కు నాంపల్లి కోర్టు 14 రోజుల పాటు రిమాండ్ విధించింది. ప్రస్తుతం రిమాండ్ ముగియడంతో రెగ్యులర్ బెయిల్ కోసం నాంపల్లి కోర్టులోనే పిటిషన్ వేసుకోవాలని హైకోర్టు సూచించింది.
Next Story