మీ ఇద్దరూ ఎప్పుడైనా డేట్‌లో ఉన్నారా?
సల్మాన్ తనకు కుటుంబసభ్యుడితో సమానం అని స్పష్టం చేసిన ప్రీతి జింటా
బాలీవుడ్ నటి ప్రీతి జింటాకు ఊహించని ప్రశ్న ఎదురైంది. సల్మాన్ ఖాన్ పుట్టినరోజు సందర్భంగా శుక్రవారం ఆమె ఎక్స్ వేదికగా పోస్టు పెట్టారు. దీనిపై ఓ నెటిజన్ స్పందిస్తూ.. మీ ఇద్దరూ ఎప్పుడైనా డేట్‌లో ఉన్నారా? అని ప్రశ్నించారు. దీనిపై ఆమె తనదైన శైలిలో జవాబిచ్చారు. సల్మాన్ తనకు కుటుంబసభ్యుడితో సమానం అని స్పష్టం చేశారు.
మేమిద్దరం అస్సులు డేట్ చేయలేదు. తను నాకు కుటుంబసభ్యుడితో సమానం. అలాగే నా భర్తకూ అతను మంచి ఫ్రెండ్. నా జవాబుతో మీరు ఆశ్చర్యానికి గురైతే నన్ను క్షమించండి అని తెలిపారు. ప్రస్తుతం ఈ పోస్టు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. నెటిజన్ తీరుపై పలువురు అసంతృప్తి వ్యక్తం చేశారు. పెళ్లైన తర్వాత ఒక నటిని ఇలాంటి ప్రశ్నలు వేయడం సరికాదని హితవు పలికారు. అలాగే ప్రీతి జింటాను మెచ్చుకుంటున్నారు.
ప్రీతి జింటా 1998లో విడుదలైన 'దిల్ సే'తో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు. ఎన్నోలవ్‌స్టోరీ మూవీస్‌లో నటించి సినీప్రియుల మది దోచారు. ప్రేమంటే ఇదరా, రాజ కుమారుడు వంటి సినిమాలతో టాలీవుడ్ అభిమానులకు పరిచయం అయ్యారు. 2018లో విడుదలైన భయాజీ సూపర్ హి్ తర్వాత ఆమె సినిమాకలు దూరంగా ఉన్నారు. ప్రస్తుతం 'లాహోర్ 1947' కోసం వర్క్ చేస్తున్నారు.