Telugu Global
Cinema & Entertainment

రామ్‌చరణ్‌ 'గేమ్‌ ఛేంజర్‌' టీజర్‌ చూశారా?

'ఐయామ్‌ అన్‌ప్రిడెక్టబుల్‌ ' అనే డైలాగ్‌తో ఈ సినిమాపై హైప్‌ క్రియేట్‌ చేసిన రామ్‌చరణ్‌

రామ్‌చరణ్‌ గేమ్‌ ఛేంజర్‌ టీజర్‌ చూశారా?
X

ఆట మొదలైందని ప్రకటిస్తూ.. 'గేమ్‌ ఛేంజర్‌' టీజర్‌ను విడుదల చేసింది మూవీ టీమ్‌. రామ్‌చరణ్‌ హీరోగా శంకర్‌ డైరెక్షన్‌లో తెరకెక్కుతున్న సినిమా ఇది. కియారా అద్వాణీ హీరోయిన్‌. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌ పతాకంపై దిల్‌రాజు, శిరీశ్‌ నిర్మిస్తున్న ఈ మూవీ సంక్రాంతి సందర్భంగా జనవరి 10న ప్రేక్షకుల ముందుకు రానున్నది.

ఈ నేపథ్యంలోనే శనివారం టీచర్‌ను విడుదల చేశారు. 'బేసిక్‌గా రామ్‌ అంత మంచోడు ఇంకొకడు లేవు. కానీ వాడికి కోపమొస్తే? వాడంత చెడ్డోడు ఇంకొకడు ఉండడు' అంటూ మొదలైన ఈ టీజర్‌లో రామ్‌చరణ్‌ భిన్నకోణాల్లో కనిపించారు . టీజర్‌లో శంకర్‌ మార్క్‌ విజువల్స్‌ కనిపించాయి. చివర్లో 'ఐయామ్‌ అన్‌ప్రిడెక్టబుల్‌ ' అనే డైలాగ్‌తో ఈ సినిమాపై హైప్‌ క్రియేట్‌ చేశారు రామ్‌చరణ్‌.


టీజర్‌ రిలీజ్‌ సందర్భంగా లఖ్‌నవూలో అభిమానుల సమక్షంలో ప్రత్యేక వేడుకను నిర్వహించారు. అందులో అభిమానులను ఉద్దశించి రామ్‌ చరణ్‌ మాట్లాడుతూ.. 'ఈ సౌండ్‌ నార్త్‌ ఇండియా మొత్తం వినిపించాలి' అన్నారు. 'శంకర్‌ డైరెక్షన్‌లో నటించడం నా అదృష్టం. నా సినిమాలను పెద్ద మనసుతో ఆదరించిన ఈ నగరంలో 'గేమ్‌ ఛేంజర్‌' టీజర్‌ విడుదల చేయడం ఆనందంగా ఉన్నది. లఖ్‌నవూ చాలా పెద్ద నగరం. ఇక్కడి మనుషులు, మనసులు కూడా చాలా పెద్దవి' అన్నారు. ఎస్‌జే సూర్య, అంజలి తదితరులు ఈ సినిమాలో కీలక పాత్ర పోషిస్తున్నారు.

First Published:  10 Nov 2024 1:04 PM IST
Next Story