కిరణ్ అబ్బవరం 'దిల్ రుబా' మూవీ టీజర్ చూశారా?
తొలిసారిగా నిర్మాణ రంగలోకి అడుగుపెట్టి నిర్మించిన ప్రముఖ మ్యూజిక్ సంస్థ సరిగమ
'క' మూవీతో విజయాన్ని అందుకున్న యువ నటుడు కిరణ్ అబ్బవరం నటించిన మరో సినిమా 'దిల్ రుబా'. ప్రముఖ మ్యూజిక్ సంస్థ సరిగమ తొలిసారిగా నిర్మాణ రంగలోకి అడుగుపెట్టి నిర్మించిన ఈ మూవీకి విశ్వకరణ్ దర్శకత్వం వహించారు. ఫిబ్రవరిలో దిల్ రుబాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ సందర్భంగా చిత్రబృందం హైదరాబాద్‌లోని సినీ మాక్స్‌లో సినిమా టీజర్‌ను విడుదల చేసింది. యువతకు నచ్చే ఇంటెన్స్ లవ్ స్టోరీతో ఈ మూవీ రూపొందిందని హీరో కిరణ్ అబ్బవరం తెలిపారు. ఇది పిల్లల నుంచి పెద్దల వరకు అందరికీ నచ్చే సినిమా అవుతుందని ఆకాంక్షించారు. ఈ సినిమాలో కిరణ్‌కు జోడిగా రుక్సర్ ధిల్లాన్ నటించగా.. సామ్ సీఎస్ సంగీతాన్ని సమకూర్చారు .
మ్యాగీతో నా ఫ్టస్ లవ్. మార్చిలో ఫెయిల్ అయినట్లు మ్యాగీతో లవ్‌లో ఫెయిల్ అయ్యాను. అప్పుడే నాకు కింగ్ అండ్ జాన్ అనే ఇద్దరు ఫ్రెండ్స్ పరిచయమయ్యారు. వాళ్లు ఇచ్చిన కౌన్సిలింగ్‌తో అమ్మాయిలకు, ప్రేమకు చాలా దూరంగా ఉన్నాను. కానీ మార్చిపోతే సెప్టెంబర్ వచ్చినట్లు నా లైఫ్‌లోకి అంజలి వచ్చింది అంటూ టీజర్‌లో కిరణ్ అబ్బవరం పలికి డైలాగ్స్ బాగున్నాయి. అలాగే నా చేతిలో గన్ ఉంటే కాల్చిపడదొబ్బేవాడని కిరణ్ అంటే రేపు తీసుకొస్తాను వేసేయ్ అని హీరోయిన్ డైలాగ్ ఇంట్రెస్టింగ్‌గా ఉన్నది. చివర్లో ప్రేమ చాలా గొప్పది.. కానీ అది ఇచ్చే బాధే చాలా భయంకరంగా ఉంటుందనే డైలాగ్ ఆలోచింపజేసేలా ఉన్నది.