Telugu Global
Cinema & Entertainment

హరిహర వీరమల్లు 'కొల్లగొట్టినాదిరో' సాంగ్‌ ప్రోమో చూశారా?

'కొరకొర మీసాలతో కొదమ కొదమ అడగులతో' అంటూ హీరోయిజాన్ని ఎలివేట్‌ చేస్తూ సాగే ఈ పాట రిలీజ్‌ ఈ నెల 24న

హరిహర వీరమల్లు కొల్లగొట్టినాదిరో సాంగ్‌ ప్రోమో చూశారా?
X

పవర్‌ స్టార్‌ పవన్‌ కల్యాణ్‌ 'హరిహర వీరమల్ల' మూవీ ప్రచార జోరు ఊపందుకున్నది. ఇప్పటికే ఓ పాటను విడుదల చేసిన మూవీ టీమ్‌ ఈ నెల 24న 3 గంటలకు 'కొల్లగొట్టినాదిరో' సాంగ్‌ను రిలీజ్‌ చేయడానికి సిద్ధమైంది. ఈ సందర్భంగా తాజాగా ఈ పాట ప్రోమోను తీసుకొచ్చింది. 'కొరకొర మీసాలతో కొదమ కొదమ అడగులతో' అంటూ హీరోయిజాన్ని ఎలివేట్‌ చేస్తూ సాగే ఈ పాట అందరినీ అలరించేలా ఉన్నది. అనసూయ, పూజిత పొన్నాడ ఈ పాటలో ప్రత్యేక ఆకర్షణ. మంగ్లీ, రహ్య బెహర, యామిని ఘంటసాల, రాహుల్‌ సిప్లిగంజ్‌ పాడిన ఈ సాంగ్‌కు కీరవాణి స్వరాలు సమకూర్చారు. చంద్రబోస్‌ సాహిత్యం అందించారు. మార్చి 28న ఈ సినిమా పార్ట్‌ 1 ప్రేక్షకుల ముందుకు రానున్నది.



First Published:  21 Feb 2025 3:35 PM IST
Next Story