Hanu-Man Box Office Collection | రూ.100 కోట్ల షేర్ దిశగా హనుమాన్
Hanu-Man Box Office Collection: తేజ సజ్జ హీరోగా నటించిన సినిమా హనుమాన్. తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా వంద కోట్ల వసూళ్లు సాధించే అవకాశం ఉంది.

Hanu-Man Box Office Collection: సూపర్ హీరో చిత్రం హనుమాన్ జనవరి 12న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదలై అందరినీ ఉర్రూతలూగిస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి ప్రేక్షకుల నుండి అద్భుతమైన రెస్పాన్స్ రావడంతో బాక్సాఫీస్ వద్ద అనూహ్యమైన వసూళ్లు వస్తున్నాయి. ఈ క్రమంలో హనుమాన్ తెలుగులో 100 కోట్ల షేర్ దిశగా దూసుకుపోతోంది.
మొదటి రోజు 24 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్ట్ చేసిన హనుమాన్ రెండో రోజు భారీ గ్రోత్ కనబరిచింది. ప్రతి సెంటర్ లో వసూళ్లు రెండో రోజుకు రెట్టింపు అయ్యాయి. సినిమా అందరి అంచనాలకు మించి వసూళ్లు సాధిస్తుండడంతో అన్ని షోలు హౌస్ ఫుల్స్ నమోదు చేస్తున్నాయి.
రాబోయే 3-4 రోజుల అడ్వాన్స్ బుకింగ్‌లు ఇప్పటికే ఫుల్ అవ్వడం ఆశ్చర్యం. ఇదే ఊపు కొనసాగితే, మరో వారం రోజుల్లో ఈ సినిమా వంద కోట్ల క్లబ్ లో చేరడం ఖాయం.
తక్కువ స్క్రీన్స్ లో రిలీజైంది హనుమాన్ సినిమా. రెండో రోజుకే ఈ సినిమాకు 30శాతం స్క్రీన్స్ అదనంగా దక్కాయి. సంక్రాంతి తర్వాత మరిన్ని స్క్రీన్స్ లో ఈ సినిమాను ప్రదర్శించబోతున్నారు. ఈ సంక్రాంతికి 4 సినిమాలు రిలీజ్ అయితే, హనుమాన్ మాత్రమే సంక్రాంతి విన్నర్ గా నిలిచింది.