Telugu Global
Cinema & Entertainment

Hanu-Man | రూ.100 కోట్ల హనుమాన్

Hanu-Man - అందరూ ఊహించినట్టుగానే హనుమాన్ సినిమా వంద కోట్ల క్లబ్ లో చేరింది. అటు ఓవర్సీస్ లో ఇది పెద్ద రికార్డ్ సృష్టించేలా ఉంది.

HanuMan Movie Review: హనుమాన్ రివ్యూ {3/5}
X

తేజ సజ్జ టైటిల్ రోల్‌లో నటించిన క్రియేటివ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ నుండి వచ్చిన మొదటి చిత్రం "హను-మాన్". తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా, దేశవ్యాప్తంగా ఈ సినిమా సూపర్ హిట్టయింది. అంతేకాదు, ఓవర్సీస్ లో కూడా టాప్ గ్రాసర్స్ టాప్-10 లిస్ట్ లో చేరింది. ప్రైమ్‌షో ఎంటర్‌టైన్‌మెంట్‌కు చెందిన కె నిరంజన్ రెడ్డి ప్రతిష్టాత్మకంగా ఈ చిత్రాన్ని నిర్మించారు.

సంక్రాంతి కానుకగా విడుదలైన హనుమాన్ సినిమా రోజురోజుకు తన వసూళ్లు పెంచుకుంటూ పోతోంది. చిన్న సినిమాగా వచ్చి అద్భుతాలు సృష్టిస్తోంది. ఈ చిత్రం నిజానికి అన్ని చోట్లా టాప్ ట్రెండింగ్ లో ఉంటూ ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా 100 కోట్ల గ్రాస్ మార్క్‌ను చేరుకుంది. ఈ స్కేల్ బడ్జెట్‌ సినిమా కు ఇది భారీ విజయం అనే చెప్పాలి.

"హను-మాన్" సినిమా ఓవర్సీస్ లో 3 మిలియన్ మార్క్ ని క్రాస్ చేసి అక్కడ ట్రిపుల్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఓవర్సీస్ లో అత్యథిక కలెక్షన్లు సాధించిన టాప్-10 తెలుగు చిత్రాల జాబితాలో చేరింది హనుమాన్. మరికొన్ని రోజుల్లో ఇది ఆదిపురుష్, సాహో సినిమాల వసూళ్లను కూడా దాటనుంది. ప్రస్తుతం నడుస్తున్న ట్రెండ్ ప్రకారం చూసుకుంటే, ఓవర్సీస్ టాప్-10లో ఐదోస్థానానికి ఈ చిత్రం ఎగబాకే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి.

First Published:  17 Jan 2024 4:37 PM GMT
Next Story