గ్రిప్పింగ్ డ్రామాలు, క్రీడా కథనాలు, థ్రిల్లింగ్ అడ్వెంచర్‌లు ఈ వారం ఓటీటీ వాచ్ లిస్ట్!
తాజా ఓటీటీ విడుదలల వారంవారీ అప్‌డేట్ కి సమయం ఆసన్నమైంది. రాబోయే ఏడు రోజులు సినిమాలు, సిరీసులు, టీవీ షోల సమ్మేళనాన్ని ఈ లిస్టు ద్వారా అందుకోవచ్చు.
తాజా ఓటీటీ విడుదలల వారంవారీ అప్‌డేట్ కి సమయం ఆసన్నమైంది. రాబోయే ఏడు రోజులు సినిమాలు, సిరీసులు, టీవీ షోల సమ్మేళనాన్ని ఈ లిస్టు ద్వారా అందుకోవచ్చు. సినిమాల విషయానికొస్తే, అక్షయ్ కుమార్ - టైగర్ ష్రాఫ్ ల తాజా యాక్షన్ థ్రిల్లర్ ‘బడే మియా చోటే మియా’ డిజిటల్ ప్రీమియర్ సిద్ధమైంది. అజయ్ దేవగణ్ నటించిన స్ఫూర్తిదాయక స్పోర్ట్స్ బయోపిక్ ‘మైదాన్’ డిజిటల్ స్క్రీన్స్ ని అలంకరించడానికి సిద్ధంగా వుంది. ‘స్టార్ వార్స్ -ది అకోలైట్’ మనోహరమైన కొత్త సిరీస్ పరిచయం వుంది. ఇంకా ఎన్నెన్నో వినోదాత్మకాలు ఈ వారం ఎంజాయ్ చేయ వచ్చు. లిస్టు ఈ క్రింది విధంగా వుంది...
1. గునా (జూన్ 3) - డిస్నీ+ హాట్‌స్టార్
ఈ సిరీస్ గష్మీర్ మహాజని నటించిన రివెంజీ డ్రామా. ఇందులో అతను ప్రేమించిన యువతి పన్నిన పన్నాగాల్లో చిక్కుకున్న గ్యాంబ్లర్ పాత్ర పోషించాడు. చేయని హత్యకి జైలు పాలైన అతను తప్పించుకుని తనకు అన్యాయం చేసిన వారిపై ప్రతీకారం తీర్చుకునేందుకు తన రూపాన్ని మార్చుకుంటాడు. ఇందులో సురభి జ్యోతి కీలక పాత్ర పోషించింది.
2. షూటింగ్ స్టార్స్ (జూన్ 3) - నెట్ ఫ్లిక్స్
1990ల నాటి కథా కాలంతో స్పోర్ట్స్ బయోపిక్ ఇది. షూటింగ్ స్టార్ అనే యువకుడు ముగ్గురు బెస్ట్ ఫ్రెండ్స్ తో కలిసి టాప్ బాస్కెట్‌బాల్ ఈవెంట్ లో ఆడేందుకు శ్వేత జాతీయుల క్యాథలిక్ పాఠశాలకి మారతాడు. అక్కడ ప్లే గ్రౌండ్ లో, వెలుపలా సవాళ్ళని ఎదుర్కొంటూ స్నేహం అంటే, ఉమ్మడి జట్టుకృషి అంటే ఏమిటో తెలుసుకుని, వాటి నిజమైన విలువని నేర్చుకుంటూ, జాతీయ ఛాంపియన్‌లుగా మారడానికి ప్రయత్నిస్తారు.
3. (జూన్ 4) - డిస్నీ+ హాట్‌స్టార్
ఈ స్పోర్ట్స్ డ్రామా సిరీస్ లో లాస్ ఏంజిల్స్ చెందిన క్రీడాకారుడు డోనాల్డ్ స్టెర్లింగ్ పతనాన్ని చిత్రిస్తుంది. అతడి జాత్యాహంకార వ్యాఖ్యలు టేప్‌లో రికార్డయి, అతడికి లేని పోని సమస్యల్ని సృష్టిస్తాయి.
4. స్టార్ వార్స్: ది అకోలైట్ (జూన్ 6) - డిస్నీ+ హాట్‌స్టార్
హై రిపబ్లిక్ యుగపు చివరి రోజుల్లో ది అకోలైట్ ప్రమాదకరమైన యోధుడితో కలిసి షాకింగ్ క్రైమ్ కేసుల్ని లోతుగా పరిశోధిస్తున్నప్పుడు, మంచి చెడు శక్తుల చీకటి రహస్యాల్ని వెలికితీస్తాడు. కథనం స్టార్ వార్స్ యూనివర్స్ లోని అస్పష్ట కోణాల్ని కూడా అన్వేషిస్తుంది.
5. వికెడ్ లిటిల్ లెటర్స్ (జూన్ 4)- బుక్ మై షో
వికెడ్ లిటిల్ లెటర్స్ అనేది 1920ల నాటి ఇంగ్లీష్ సముద్రతీర పట్టణం లిటిల్‌హాంప్టన్‌లో జరిగిన నిజమైన కుంభకోణం ఆధారంగా ఒక బ్లాక్ కామెడీ మిస్టరీ.
6. మైదాన్ (జూన్ 5) – అమెజాన్ ప్రైమ్ వీడియో
ఈ బయోగ్రాఫికల్ స్పోర్ట్స్ డ్రామాలో అజయ్ డెవగణ్ సయ్యద్ అబ్దుల్ రహీమ్‌గా నటించాడు. అతను 1952 నుంచి 1962 వరకు భారత ఫుట్‌బాల్ తీరుని మార్చిన లెజెండరీ కోచ్. ఈ ఆకట్టుకునే కథనం అతడి క్రీడా ప్రయాణంలో జట్టుని నడిపించడానికి ఎదురైన సవాళ్ళని, విజయాల్నీ హైలైట్ చేస్తుంది. 1956 ఒలింపిక్స్ లో, ఆ తర్వాత ఆసియా క్రీడల్లో భారతదేశపు పురోగతిని ఈ హిందీ మూవీ ప్రదర్శిస్తుంది.
7. పారిస్ కింద (జూన్ 5) –నెట్ ఫ్లిక్స్
ఇది ప్రపంచ ట్రయాథ్లాన్ ఛాంపియన్‌షిప్స్ కి ఆతిథ్యం ఇవ్వబోతున్న సమయంలో సీన్ నదిలో దాగి వున్న ఒక పెద్ద సొరచేపని కనుగొన్న శాస్త్రవేత్త సోఫియా చుట్టూ కేంద్రీకృతమయ్యే థ్రిల్లర్. ఆమె మికా అనే యువ పర్యావరణ కార్యకర్తతో, సీన్ రివర్ పోలీస్ కమాండర్ ఆదిల్‌తో కలిసి అధికారుల్ని హెచ్చరించడానికీ, అథ్లెట్లని, పౌరుల్నీ రాబోయే ప్రమాదం నుంచి రక్షించడానికీ తాపత్రయ పడుతుంది.
8. బడే మియా- చోటే మియా (జూన్ 6) -నెట్ ఫ్లిక్స్
ఈ యాక్షన్-ప్యాక్డ్ థ్రిల్లర్ లో అక్షయ్ కుమార్ కెప్టెన్ ఫిరోజ్ “ఫ్రెడ్డీ”గా, టైగర్ ష్రాఫ్ కెప్టెన్ రాకేష్ “రాకీ”గా నటించారు. తమ విరోధి డాక్టర్ కబీర్ (పృథ్వీరాజ్ సుకుమారన్) నుంచి అతను భారత గడ్డపై దాడి చేసే లోగా అతడి దగ్గరున్న ఏఐ ఆయుధాన్ని చేజిక్కించుకునే ప్రమాదకర ఆపరేషన్ ని ఇద్దరూ చేపడతారు.
9. బాకీ హన్మా వర్సెస్ కెంగాన్ అషురా (జూన్ 6) –నెట్ ఫ్లిక్స్
ఈ జపనీస్ యాక్షన్ యానిమేషన్ లో ఇద్దరు మార్షల్ ఆర్ట్స్ ఫైటర్‌లు పరస్పరం తలపడే కథని చూపిస్తుంది.
10. స్వీట్ టూత్ సీజన్ 3 (జూన్ 6) –నెట్ ఫ్లిక్స్
ఈ సిరీస్ హైబ్రిడ్ బాలుడు, అతడి సహచరులు అలాస్కాలో ప్రమాదకరమైన అన్వేషణని ప్రారంభించి, ప్రాణాంతక వైరస్ ని నిర్మూలించే రసవత్తర కథతో కూడుకుని వుంటుంది.
11. బ్లాక్అవుట్ (జూన్ 7) –జియో సినిమా
ఇది విక్రాంత్ మాసే నటించిన క్రైమ్ థ్రిల్లర్. ఒక భారీ నగల దోపిడీని ఎదుర్కొనేందుకు నగరవ్యాప్త బ్లాక్‌అవుట్ విధించిన నేపథ్యంలో సాగే థ్రిల్లింగ్ సస్పెన్స్ డ్రామా.
12. గుల్లక్ సీజన్ 4 (జూన్ 7) – సోనీ లివ్
భారతదేశంలోని ఒక చిన్న పట్టణంలో మధ్యతరగతి జీవితంలోని రోజువారీ ఆనందాలు, సవాళ్ళు నావిగేట్ చేస్తున్నప్పుడు-సంతోష్, శాంతి, వారి కుమారులు అన్నూ, అమన్ లపై పడిన ప్రభావాన్ని సమున్నతంగా చిత్రించే సిరీస్ ఇది.
13. హిట్ మ్యాన్ (జూన్ 7) –నెట్ ఫ్లిక్స్
ఈ రోమాంటిక్ యాక్షన్ కి ఒక నిజ కథ ఆధారం. న్యూ ఓర్లీన్స్ పోలీస్ డిపార్ట్ మెంట్ లో పార్ట్ టైమ్ వర్కర్ హిట్‌మ్యాన్‌గా వుంటాడు. ఒక యువతి అతడ్ని కలిసి భర్తని చంపాలన్నప్పుడు ఆమెతో ఒక విచిత్ర రోమాంటిక్ యాక్షన్ కథ మొదలవుతుంది.
మరి కొన్ని సంక్షిప్తంగా...
14. పర్‌ఫెక్ట్ మ్యాచ్- 2,వెబ్‌సిరీస్ (జూన్ 7) -నెట్ ఫ్లిక్స్
15. ది లెజెండ్ ఆఫ్ హనుమాన్,హిందీ సిరీస్ (జూన్ 5) - డిస్నీ ప్లస్ హట్‌స్టార్
16. వర్షన్గల్కు శేషం, మలయాళం మూవీ (జూన్ 7) - సోనీలివ్
17. బూమర్ అంకుల్, తమిళం మూవీ, (జూన్ 7) -ఆహా
18. ఎబిగైల్, హాలీవుడ్ మూవీ (జూన్ 7) – బుక్ మై షో