Telugu Global
Cinema & Entertainment

Rama Banam - గోపీచంద్ సినిమా ఫస్ట్ మోషన్ పోస్టర్

Gopichand's Rama Banam - గోపీచంద్ కొత్త సినిమా రామబాణం. ఈ మూవీ మోషన్ పోస్టర్ రిలీజ్ అయింది

Rama Banam - గోపీచంద్ సినిమా ఫస్ట్ మోషన్ పోస్టర్
X

గోపీచంద్, డైరెక్టర్ శ్రీవాస్‌ కాంబినేషన్ లో ఇంతకుముందు 'లక్ష్యం', 'లౌక్యం' సినిమాలొచ్చాయి. ఇప్పుడీ ఇద్దరూ కలిసి చేస్తున్న మూడో సినిమా 'రామబాణం'. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌ లో ఈ చిత్రం రూపొందుతోంది. టీజీ విశ్వప్రసాద్, వివేక్ కూచిభొట్ల సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇందులో గోపీచంద్ సరసన హీరోయిన్ గా డింపుల్ హయతి నటిస్తుండగా, జగపతి బాబు, కుష్బూ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు.

'రామబాణం'లో విక్కీ అనే పవర్ ఫుల్ పాత్రలో గోపీచంద్ కనిపించనున్నాడు. తాజాగా ఫస్ట్ లుక్ ని విడుదల చేశారు. 'విక్కీస్ ఫస్ట్ యారో' పేరుతో విడుదల చేసిన ప్రత్యేక వీడియో విశేషంగా ఆకట్టుకుంటోంది. హీరోది రామబాణంలా దూసుకుపోయే స్వభావమని తెలిపేలా చేతికి బాణం లాకెట్ ధరించి అదిరిపోయే ఫైట్ తో గోపీచంద్ ఎంట్రీ ఇచ్చాడు.

ఆయనకు సరైన యాక్షన్ సినిమా పడితే ఏ రేంజ్ లో చెలరేగిపోతాడో కేవలం కొన్ని సెకన్ల వీడియోతోనే చూపించాడు దర్శకుడు శ్రీవాస్. అలా అని ఇది పూర్తి యాక్షన్ ఫిల్మ్ కాదు.. తమ గత చిత్రాల తరహాలో ఎంటర్టైన్మెంట్ కూడా ఉంటుందని తెలిపేలా కొసమెరుపుతో ముగించారు. చిన్నోడా అనే వాయిస్ రాగానే హీరో, సౌమ్యంగా అమృత నిలయంలోకి ప్రవేశించడం ఆకట్టుకుంది. వీడియోలో హీరో పాత్రలో చూపించిన వ్యత్యాసానికి తగ్గట్లుగా మిక్కీ జే మేయర్ అందించిన నేపథ్య సంగీతం మెప్పించింది.

గోపీచంద్ కెరీర్ లో 30వ సినిమా ఇది. ఈ చిత్రాన్ని ఈ ఏడాది వేసవి కానుకగా విడుదల చేయడానికి నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు.



First Published:  19 Feb 2023 4:10 PM
Next Story