Telugu Global
Cinema & Entertainment

Gopichand | భీమా ప్రయాణం అలా మొదలైంది

Gopichand - భీమా సినిమా గోపీచంద్ దగ్గరకు ఎలా వచ్చింది.. అసలు ఈ సినీ ప్రయాణం ఎలా మొదలైంది,,?

Gopichand | భీమా ప్రయాణం అలా మొదలైంది
X

హీరో గోపీచంద్ తాజా చిత్రం భీమా. ఈ సినిమాకి ఎ.హర్ష దర్శకత్వం వహించాడు. కె కె రాధామోహన్ నిర్మించారు. ప్రియా భవానీ శంకర్, మాళవిక శర్మ హీరోయిన్స్ గా నటించిన ఈ సినిమా, ప్రచారంతో అందర్నీ ఆకర్షిస్తోంది. మార్చి 8న మహా శివరాత్రి సందర్భంగా ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా విడుదల కానుంది. ఈ నేపధ్యంలో హీరో గోపీచంద్ సినిమా విశేషాల్ని పంచుకున్నాడు. భీమా జర్నీ ఎలా మొదలైందో వివరించాడు.

"ఈ సినిమా సహ-నిర్మాత శ్రీధర్ గారు, కోవిడ్ సమయంలో దర్శకుడు హర్షని పరిచయం చేశారు. అప్పుడు ఒక కథ చెప్పారు హర్ష. కథ బావుంది కానీ ఇలాంటి సమయంలో వద్దనిపించింది. పోలీసుకి సంబంధించి ఏదైనా డిఫరెంట్ కథ ఉంటే చెప్పమన్నాను. 8 నెలలు గ్యాప్ తీసుకొని భీమా కథ చెప్పారు. కథ, భీమా క్యారెక్టరైజేషన్ చాలా నచ్చింది. కథలోని సెమీ ఫాంటసీ ఎలిమెంట్ కూడా చాలా నచ్చింది. అలా భీమా మొదలైంది."

రాక్షసుడిని చంపాలంటే బ్రహ్మరాక్షసుడు రావాలని, అందుకే భీమా పాత్రకు బ్రహ్మ రాక్షసుడు అని పిలిచినట్టు చెప్పుకొచ్చాడు గోపీచంద్. భీమా కమర్షియల్ మూవీ అయినప్పటికీ, ప్రేమ, ఎమోషన్స్, రొమాన్స్ కూడా ఉంటాయని చెబుతున్నాడు.

సినిమా చూసి బయటికి వచ్చాక భీమా పాత్ర ప్రేక్షకుడి మనసులో నిలిచిపోతుందని నమ్మకంగా చెబుతున్నాడు గోపీచంద్. ఈ కథలో సెమీ ఫాంటసీ ఎలిమెంట్ ఆడియన్స్ కు నచ్చుతుందని చెబుతున్నాడు.

First Published:  5 March 2024 10:55 PM IST
Next Story