Telugu Global
Cinema & Entertainment

Geethanjali 2 | 50వ సినిమాతో సిద్ధమైన అంజలి

Geethanjali 2 - కెరీర్ లో అప్పుడే 50వ చిత్రం మైలురాయికి చేరుకుంది అంజలి. అది కూడా సూపర్ హిట్ సినిమాకు రీమేక్ కావడం విశేషం.

Geethanjali 2 | 50వ సినిమాతో సిద్ధమైన అంజలి
X

హీరోయిన్ అంజలి టైటిల్ పాత్రలో నటిస్తోన్న హారర్ కామెడీ మూవీ ‘గీతాంజలి మళ్ళీ వచ్చింది’. ప్రముఖ రైటర్, ప్రొడ్యూసర్ కోన వెంకట్ సమర్పణలో ఈ సీక్వెల్‌ను ఎంవీవీ సినిమా, కోన ఫిల్మ్ కార్పొరేష‌న్‌ సంస్థలపై ఎంవీవీ స‌త్యనారాయ‌ణ, జీవీ ప్ర‌తిష్టాత్మ‌కంగా నిర్మిస్తున్నారు.

అంజ‌లి న‌టిస్తోన్న‌ 50వ సినిమా ఇది. హారర్ కామెడీ జోనర్ లో ట్రెండ్ సెట్ చేసిన గీతాంజలి సినిమాకు ఇది సీక్వెల్. ఈ ఏడాది ప్రథమార్థంలో విడుదలకు సిద్ధమవుతోన్న ఈ సినిమాను శివ తుర్లపాటి తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాలో క్లయిమాక్స్ నెక్ట్స్ లెవెల్ లో ఉంటుందని అంటోంది అంజలి.

"గీతాంజలి నా కెరీర్‌లో తొలి హీరోయిన్ ఓరియెంటెడ్ మూవీ. చాలా పెద్ద హిట్ అయ్యింది. అదే కాన్ఫిడెన్స్‌తోనే గీతాంజలి మళ్ళీ వచ్చింది అనే సినిమా చేశాం. సీక్వెల్ చేయాలని చాలా రోజులుగా అనుకుంటున్నాం. సినిమా చూశాను. చాలా బావుంది. సినిమా అంతా ఒక ఎత్తైతే .. క్లైమాక్స్ మరో రేంజ్‌లో ఉంటుంది. విజువల్, గ్రాండ్ నెస్ నెక్ట్స్ రేంజ్‌లో ఉంటాయి."

ఈ సీక్వెల్ లో పెద్దపెద్ద పాత్రలున్నాయట. అందుకే సునీల్, అలీ, సత్య లాంటి పెద్ద నటుల్ని తీసుకున్నారట. వీళ్ల కామెడీ సినిమాకు పెద్ద ప్లస్ అవుతుందని అంటోంది అంజలి. సినిమాలో తను ముద్దుగా కనిపించినా, తను చేసే పనులు మాత్రం అందర్నీ భయపెడతాయని చెబుతోంది.

First Published:  7 Jan 2024 8:52 PM IST
Next Story