Telugu Global
Cinema & Entertainment

Gangs Of Godavari | విశ్వక్ కెరీర్ లోనే పెద్ద సినిమా

Gangs of Godavari: విశ్వక్ సేన్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమా.

Gangs Of Godavari | విశ్వక్ కెరీర్ లోనే పెద్ద సినిమా
X

Gangs of Godavari : గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమా విశ్వక్ సేన్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. శుక్రవారం రిలీజైన ఈ సినిమా మొదటి రోజు ప్రపంచవ్యాప్తంగా 8 కోట్ల రూపాయల గ్రాస్ కొల్లగొట్టింది. రెండో రోజు కూడా ఈ సినిమాకు స్టడీగా వసూళ్లు వచ్చాయి. 2 రోజుల్లో 12 కోట్ల రూపాయల గ్రాస్ వచ్చింది. ఎగ్జిట్ పోల్స్ వల్ల ఈవెనింగ్ షోలు కాస్త తగ్గినప్పటికీ, కలెక్షన్లు నిలకడగా ఉన్నాయి. ఇక ఆదివారం వసూళ్లు ఈ సినిమాకు కీలకంగా మారబోతున్నాయి.

విశ్వక్, నేహా శెట్టి హీరోహీరోయిన్లుగా నటించిన ఈ సినిమాలో అంజలి కీలక పాత్రలో కనిపించింది. సితార ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై నాగవంశీ నిర్మించినవ ఈ సినిమా చాన్నాళ్లుగా వాయిదా పడింది. ఈ గ్యాప్ లో ఎన్నో రీషూట్స్ జరిగాయి. దీంతో బడ్జెట్ తడిసిమోపెడైంది. మరోవైపు వడ్డీలు పెరిగిపోయాయి.

సో.. ఇవన్నీ రికవర్ అవ్వాలంటే గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమాకు భారీగా వసూళ్లు రావాల్సి ఉంటుంది. ప్రస్తుతం థియేటర్లలో స్తబ్దత నడుస్తోంది. గ్యాంగ్స్ ఆఫ్ గోదావరికి ముందు పెద్ద సినిమాల్లేవ్. ఈ సినిమాతో పాటు వచ్చిన గం..గం..గణేశ చతికిలపడింది. భజే వాయువేగం అంత వేగం చూపించడం లేదు.

సో.. మాస్ ఎలిమెంట్స్ తో తెరకెక్కిన గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమాకు పరిస్థితులన్నీ అనుకూలంగా ఉన్నాయి. మౌత్ టాక్ కూడా తోడైతే సినిమా బ్రేక్ ఈవెన్ అవ్వడం ఏమంత కష్టం కాదు.

First Published:  2 Jun 2024 4:08 PM GMT
Next Story