Telugu Global
Cinema & Entertainment

గేమ్ ఛేంజర్ టీజర్ రిలీజ్ ఎప్పుడంటే ?

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా డైరెక్టర్ శంకర్ రూపొందిస్తున్న సినిమా గేమ్ ఛేంజర్. తాజాగా ఈ మూవీకి సంబంధించి ఓ న్యూస్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది.

గేమ్ ఛేంజర్ టీజర్ రిలీజ్ ఎప్పుడంటే ?
X

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా డైరెక్టర్ శంకర్ రూపొందిస్తున్న సినిమా గేమ్ ఛేంజర్. తాజాగా ఈ మూవీకి సంబంధించి ఓ న్యూస్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. ఈ సినిమా టీజర్‌ను దసరా కానుకగా ఫ్లాన్ చేస్తున్నాట్లు తెలుస్తుంది. ఇక మెగా ఫ్యాన్స్‌కు పండుగ అని చెప్పవచ్చును. మూడేళ్లుగా ఈ మూవీ షూటింగ్ సాగుతూనే ఉంది. పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్‌గా గేమ్ ఛేంజర్ చిత్రన్ని తమిళ స్టార్ డైరెక్టర్ శంకర్ తెరకెక్కించారు.

అయితే ఈ సినిమా విడుదల ఎప్పుడు అనే విషయంలో కీలక అప్డేట్‌ని సంగీత దర్శకుడు థమన్ చెప్పేశారు. క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 20న తేదీన విడుదల అవుతుందని థమన్ తెలిపారు. ఈ చిత్రంలో రామ్‍చరణ్ సరసన కియారా అడ్వానీ హీరోయిన్‍గా చేశారు. ఎస్‍జే సూర్య, అంజలి, సునీల్, శ్రీకాంత్, జయరాం, ప్రకాశ్ రాజ్ కీలకపాత్రలు పోషించారు. శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై దిల్‍రాజుతో పాటు శిరీష్ ఈ మూవీని ప్రొడ్యూజ్ చేశారు. పొలిటికల్ అంశం ఉన్నా ఈ మూవీ పక్కా కమర్షియల్‍ ఎంటర్‌టైనర్‌గా ఉంటుందని దిల్‍రాజు ఇటీవల చెప్పారు.

First Published:  21 Sept 2024 12:57 PM GMT
Next Story