Game Changer | క్రిమినల్ కేసులు పెట్టిన దిల్ రాజు
Game Changer song leaked - ఊహించని విధంగా గేమ్ ఛేంజర్ సినిమా నుంచి సాంగ్ లీక్ అయింది. ఆగ్రహించిన దిల్ రాజు, క్రిమినల్ కేసు నమోదు చేశాడు.

Ram Charan's Game Changer: 12 వందల మందితో ఒక్కడు
ఊహించని విధంగా వార్తల్లో నిలిచింది గేమ్ ఛేంజర్ సినిమా. అప్ డేట్ రిలీజ్ చేయడం వల్ల ఇది హాట్ టాపిక్ అవ్వలేదు. అందర్నీ షాక్ కు గురిచేస్తూ ఈ సినిమా నుంచి ఓ సాంగ్, సోషల్ మీడియాలో ప్రత్యక్షమైంది.
అవును.. గేమ్ ఛేంజర్ సినిమాకు నుంచి ఓ సాంగ్ లీక్ అయింది. తమన్ కంపోజ్ చేసిన పాట ఒకటి ఉన్నట్టుండి ఫేస్ బుక్, ట్విట్టర్ లో దర్శనమిచ్చింది. దీంతో చాలామంది ఈ పాటను షేర్ చేయడం ప్రారంభించారు. అలా గేమ్ ఛేంజర్ ఫస్ట్ సాంగ్, మేకర్స్ రిలీజ్ చేయకుండానే బయటకు వచ్చేసింది.
ఊహించని విధంగా తమ సినిమా నుంచి సాంగ్ లీక్ అవ్వడంతో దిల్ రాజు సీరియస్ అయ్యాడు. వెంటనే లీక్ చేసిన వ్యక్తుల్ని గుర్తించారు. వాళ్లపై క్రిమినల్ కేసులు నమోదు చేశారు. సదరు సాంగ్ ను ఎవరైనా షేర్ చేస్తే, వాళ్లపై కూడా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
నిజానికి ఇది పూర్తి సాంగ్ కాదంటున్నారు మేకర్స్. పాట ఇంకా రికార్డింగ్ స్టుడియోలోనే ఉందని, పూర్తిగా కంపోజ్ కాలేదని చెబుతున్నారు. అంతలోనే ఆ పాట సోషల్ మీడియాలో ప్రత్యక్షమైంది.
రామ్ చరణ్ హీరోగా శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా గేమ్ ఛేంజర్. కియరా అద్వానీ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాను దిల్ రాజు నిర్మిస్తున్నాడు. తమన్ సంగీత దర్శకుడు.